MLC Nagababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై జనసేన పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సరికొత్త వ్యూహాలతో జనసేన ముందుకు వెళుతోంది.
అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిని ప్రధాన అజెండాగా చేసుకుని పనిచేస్తున్నట్లు జనసేన అగ్రనేత, ఎమ్మెల్సీ నాగబాబు అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు అవసరమైన సన్నాహాలు వేగవంతం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
Read Also: Gold Mines in Kuppam: ఏపీకి మరో గోల్డ్ మైన్.. కుప్పంలో బంగారం గనులు గుర్తింపు!
Pawan took up that portfolio specifically for the sake of tribal rights… Naga Babu.
MLC Nagababu: గిరిజన హక్కుల కోసమే పవన్ ఆ శాఖ తీసుకున్నారు
గిరిజన హక్కుల పరిరక్షణ, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను తీసుకున్నారని నాగబాబు గుర్తుచేశారు. గిరిజనుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు కురుడి, డుంబ్రిగూడ, బల్లగరువు, పోతంగి, అనంతగిరి, పాడేరు, అరకు, పెద్దబాడు వంటి మారుమూల గిరిజన ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ స్వయంగా పర్యటించారని.. అక్కడి క్షేత్రస్థాయి సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు.
ఏజెన్సీ ప్రాంతాల కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతిష్టాత్మక చర్యలను నాగబాబు వివరించారు. 'అడవితల్లి బాట' అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాలకు రూ. 1,005 కోట్లతో సుమారు 1,069 కిలోమీటర్ల మేర అధునాతన రోడ్లను నిర్మించారు. పీఎం జన్మన్ నిధుల నుంచి రూ. 555 కోట్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద రూ. 2,525 కోట్లు, వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో రూ. 50 కోట్లు కేటాయించి గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులను భారీగా మెరుగుపరుస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణకే తొలి ప్రాధాన్యం
ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ అంశాలపై జనసేన అగ్రనేత స్పష్టతనిచ్చారు. బాక్సైట్ మైనింగ్, హైడ్రో ప్రాజెక్టుల వంటి వ్యవహారాల్లో స్థానిక పర్యావరణానికి మరియు గిరిజనుల సాంప్రదాయ జీవన విధానానికి ఎలాంటి హాని కలగకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటామని నాగబాబు హామీ ఇచ్చారు. ప్రకృతిని, గిరిజన సంస్కృతిని కాపాడుతూనే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
Epaper: epaper.vaartha.com

