Agency areas:భారతదేశం వైవిధ్యభరితమైన సంస్కృతి, సంప్రదాయా లు, వర్గాలతో కూడిన గొప్ప దేశం. ఈ దేశంలో నివ సించే గిరిజనులు తమ ప్రత్యేక జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, సంప్రదాయ జ్ఞానంతో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నారు.
చరిత్రలో చాలాకాలం పాటు గిరిజన సమా జం ప్రధాన అభివృద్ధి ధార నుండి దూరంగా ఉండిపోయిం ది. విద్య, ఆరోగ్యం, ఉపాధి, మౌలిక సదుపాయాల వంటి ప్రాథమిక అవకాశాలు వారికి సరైన స్థాయిలో అందలేదు. ఈపరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం గిరి జనుల సంక్షేమం కోసం అనేక ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో ముఖ్యంగా గిరిజనుల అధిక జనాభా ఉన్న ప్రాం తాలను ఏజెన్సీ ప్రాంతాలుగా ప్రకటించడం ఒక ముఖ్యమైన చర్య. ఈ ప్రాంతాల్లో గిరిజనుల హక్కులను రక్షించేందుకు వారి అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రత్యేక చట్టాలు, నియమాలు అమలు చేయబడుతున్నాయి. ముఖ్యంగా 1/70 భూ చట్టం ద్వారా గిరిజనుల (Tribal)భూమిని గిరిజనేతరులకు అమ్మడం లేదా బదిలీ చేయడం నిషేధం. అలాగే పేసా- 1996 చట్టం ప్రకారం గ్రామ సభకు ప్రత్యేక అధికారాలు, భూమి వినియోగం, అడవి వనరులపై ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఈ చట్టాల ప్రధాన లక్ష్యం గిరిజనుల భూమి, సంస్కృతి, జీవన విధానాన్ని కాపాడటం.
Read Also : AP Drinking Water Schemes: తాగునీటి పథకాలకు రూ.9,335 కోట్లు ఆమోదం

The government’s main objective is to protect the economic and social security of tribals.
ఆర్థిక, సామాజిక భద్రత
ఏజెన్సీ ప్రాంతాల ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం గిరిజన సమాజాన్ని రక్షించడం. వారికి సమాన అవకాశాలు కల్పించడం. ఈ ప్రాంతాల్లో గిరిజనుల భూమి హక్కులను కాపాడటానికి ప్రత్యేక చట్టాలు అమలు చేయబడుతున్నాయి. అడవులపై హక్కులు, భూముల పరిరక్షణ, విద్యా సౌకర్యాలు, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ పథకాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. గిరిజనుల భూములు ఇతరులు ఆక్రమించకుండా ఉండేందుకు భూమి కొనుగోలు విక్రయాలపై కఠినమైన నియమాలు అమలు చేస్తారు. ఈ చర్యల ద్వారా గిరిజనుల (Tribal)ఆర్థిక, సామాజిక భద్రతను కాపాడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో షెడ్యూల్డ్ తెగలు లేకపోయినా కూడా ఆ గ్రామా లు ఇప్పటికీ ఏజెన్సీ గ్రామాలుగాకొనసాగుతున్నాయి. ఇది సరైన అధ్యయనం లేకుండా గతపాలకులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల ఫలితంగా గిరిజనులు లేని, అతి తక్కువ మంది గిరిజనులు ఉన్న కొన్ని గ్రామాలు కూడా ఏజెన్సీ ప్రాంతాల జాబితాలో చేర్చబడ్డాయి.
అయితే చట్టపరమైన మార్పులు జరగకపోవడం వల్ల ఇప్పటికీ ఆ గ్రామాలు ఏజెన్సీ గ్రామాలుగానే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి వల్ల అక్కడ నివసిస్తున్న గిరిజనేతర ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భూమి హక్కులు, ప్రభుత్వ పథకాల లబ్ధి, పరిపాలనలో భాగ స్వామ్యం వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అమలులో ఉన్న చట్టాల ప్రకారం గిరి జనేతరులు భూమి కొనుగోలు చేయడం లేదా విక్రయించ డం చాలా కష్టతరమైన విషయం. కొన్ని సందర్భాల్లో పూర్తిగా నిషేధం కూడా ఉంటుంది. దీనివల్ల గిరిజనేతర రైతులు తమ భూములను అమ్ముకోవడం లేదా కొత్త భూములు కొనుగోలు చేయడం కష్టమవుతోంది. అవసరాల సమయం లో భూమిని విక్రయించాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ చట్ట పరమైన పరిమితుల కారణంగా అది సాధ్యం కాక ఇబ్బందు లు పడుతున్నారు.
సమగ్ర సర్వే
భూమిపై స్పష్టమైన యాజమాన్యాలు హక్కులు లేకపోవడంతో బ్యాంకులు సైతం రుణాలు ఇచ్చేం దుకు నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితి వారి ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇక అభివృద్ధి కార్యక్ర మాల విషయానికి వస్తే కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక విధానాలు అమలులో ఉంటాయి. ఈ కారణంగా సాధారణ గ్రామాల కంటే అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. రహదారులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ఇతర అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టడంలో కొన్ని పరిమితులు ఉంటాయి. గిరిజ నులు లేని గ్రామాల్లో ఈ పరిమితులు అవసరం లేకపోయి నా కూడా చట్టపరంగా అవి అమలులో ఉండటం వల్ల అభి వృద్ధి వేగం తగ్గిపోతుంది. దీనివల్ల గ్రామాల సామాజిక ఆర్థిక పురోగతి నెమ్మదిస్తుంది. అప్పటి పరిస్థితుల్లో సరైన సమా చారం లేకపోవడం లేదా పూర్తిస్థాయి సర్వేలు జరగకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది.
కాలక్రమేణా గ్రామాల జనాభా నిర్మాణం మారిపోయింది. ఈ పరిస్థితి గిరిజనేతర ప్రజల్లో అన్యాయం జరుగుతున్నదనే భావనను కలిగిస్తోంది. అందువల్ల గిరిజనులు లేని గ్రామాలను పునఃపరిశీలించడం చాలా అవసరం. ప్రభుత్వం ఒక సమగ్ర సర్వే నిర్వహించి గ్రామాల వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలి. గ్రామాల్లో గిరిజన లేదా ఆదివాసీ జనాభా లేకపోతే లేదా చాలా తక్కువగా ఉంటే అలాంటి గ్రామాలను ఏజెన్సీ ప్రాం తాల జాబితా నుండి తొలగించి మైదాన ప్రాంతాలుగా ప్రక టించడం అవసరం. అలా చేస్తే అక్కడి ప్రజలకు సమాన అవకాశాలు లభిస్తాయి. భూమి కొనుగోలు, విక్రయాల విషయంలో ఉన్న పరిమితులు తొలగిపోతాయి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగంగా అమలు కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్రామాల్లో పెట్టుబడులు, పరిశ్రమలు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా సులభతరం అవుతుంది. దీనివల్ల గ్రామాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడ టంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతా యి. అయితే ఈ ప్రక్రియలో గిరిజనుల హక్కులు ఎట్టి పరి స్థితుల్లోనూ దెబ్బతినకూడదు.
It is essential to re-examine villages that do not have tribals.
రాజ్యాంగ సూత్రాలు ప్రతి పౌరుడికి సమానంగా
షెడ్యూల్డ్ తెగలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఏజెన్సీ చట్టాలు కొనసాగించాలి. ఎందుకంటే ఆ చట్టాలు గిరిజనుల భూమిహక్కులను రక్షిం చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గిరిజన సమాజం అభివృద్ధి కోసం ప్రత్యేక రక్షణలు చాలా అవసరం. కాబట్టి గిరిజనులు అధికంగా ఉన్నప్రాంతాల్లో ఆ రక్షణలు కొనసా గించాలి. కానీ గిరిజనులు లేని గ్రామాల్లో అదే విధమైన నియమాలు కొనసాగించడం అవసరం లేదని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిస్థితి సమాజంలో అసమాన తను పెంచే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలి. గ్రామాల పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అవసరమైతే నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి గ్రామాల స్థితిగతులను పరిశీలించాలి. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకుంటే గిరిజనేతరులు ఎదుర్కొంటు న్న సమస్యలకు పరిష్కారంలభిస్తుంది. సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ సూత్రాలు ప్రతి పౌరుడికి సమానంగా వర్తిం చాలి. ఒకవర్గం అభివృద్ధి కోసం తీసుకునే చర్యలు, మరొక వర్గం హక్కులను దెబ్బతీయకుండా ఉండటం అవసరం. అం దువల్ల గిరిజనులులేని, అతి తక్కువ గిరిజనులున్న గ్రామాల పరిస్థితిని ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి, అవసరమైన మార్పులు చేయాలి. సమాజంలో ప్రతివర్గం అభివృద్ధి చెందే లా, ఎవరికీ అన్యాయం జరగకుండా సమతుల్య విధానాలు అమలు చేయడం ప్రభుత్వాల బాధ్యత. నిజమైన అభివృద్ధి అనేది ఒక వర్గానికి మాత్రమే కాకుండా, సమాజంలోని ప్రతి పౌరుడి హక్కులురక్షించబడినప్పుడే నిజమైన అభివృద్ధిగా నిలుస్తుందని బుద్ధిజీవులు అభిప్రాయపడుతున్నారు.
-మానిక్, డోంగ్రే
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

