Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్లోబల్ హబ్‌గా మార్చడమే లక్ష్యం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!

గ్లోబల్ హబ్‌గా మార్చడమే లక్ష్యం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!

వార్త 2 months ago

Telangana Aerospace Sector Development: భవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

ఆర్అండ్, ఆడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్టిఫికేషన్ అండ్ కాంప్లియెన్స్ ఈ మూడింటిని అనుసంధానించగలిగే దేశాలు, రాష్ట్రాలే రాబోయే రోజుల్లో ఏరోస్పేస్లో గ్లోబల్ లీడర్గా ఎదుగుతాయన్నారు. ఆ దిశగా ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్లు, మార్పుల్ని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Read Also:Extramarital affair : వివాహేతర సంబంధాలు… తెలంగాణలో రెండు దారుణాలు

 Telangana Aerospace Sector Development: The goal is to make it a global hub.. Minister Sridhar Babu’s key comments!

శుక్రవారం ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఛేంజింగ్ సినారియో ఇన్ ఏరోస్పేస్, ఆర్అండ్, మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సర్టిఫికేషన్ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఏరోస్పేస్ అంటే కేవలం యంత్రాల తయారీ మాత్రమే కాదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఒక దేశ వ్యూహాత్మక శక్తికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఈ రంగంలో ఒకప్పుడు యూఎస్, రష్యా, ఐరోపా దేశాలదే ఆధిపత్యం చెలాయించేవని, ఇప్పుడు వాటికి ధీటుగా గ్లోబల్ సప్లై చైన్లో మన దేశం కూడా కీరోల్ ప్లే చేస్తుందన్నారు. యునెస్కో గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైంటిస్టులు. ఇంజనీర్లు మన దేశంలోనే ఉన్నారన్నారు. కానీ మెకిన్సే నివేదిక ప్రకారం.. ల్యాబ్లో జరిగే పరిశోధనల్లో 30 శాతం కూడా కమర్షియల్ మాన్యుఫ్యాక్చరింగ్ కు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశోధనల్ని ఉత్పత్తులుగా మార్చాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

శంషాబాద్ విమానాశ్రయంలో థాయ్ లాండ్ మహిళ అరెస్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha