Ganja Seized at Shamshabad Airport: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ఆగడం లేదు. ఈ నెలలో మూడుసార్లు ముగ్గురు వ్యక్తులు విదేశాల నుంచి ఖరీదైన హైబ్రీడ్ గంజాయిని హైదరాబాద్కు స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోగా శుక్రవారం ఉద యం థాయ్లాండ్కు చెందిన ఓ మహిళ ఇదే రకం గంజాయి మూడు కిలోలను తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది.
Read Also:Extramarital affair : వివాహేతర సంబంధాలు… తెలంగాణలో రెండు దారుణాలు
Thai woman arrested at Shamshabad airport
Ganja Seized at Shamshabad Airport: వివరాలు ఇలా వున్నాయి. థాయ్ ఎయిర్వేస్కు చెందిన విమానం బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు రాగా అందులో వచ్చిన ఓ మహిళ తన లగేజిని తనిఖీ కోసం కస్టమ్స్ అధికారులకు ఇచ్చింది. ఈ క్రమంలో ఆ మహిళ ప్రవర్తన వింతగా, అనుమానాస్పదంగా వుండడంతో అధికారులు ఆమెను నిలదీయడంతో పాటు లగేజి బ్యాగ్ను క్షుణ్ణంగా సోదా చేయగా అందులో మూడు కిలోల హైబ్రీడ్ గంజాయి కనిపించడంతో దానిని జప్తు చేశారు. అనంతరం ఆ మహిళను విచారించగా తాను థాయ్లాండ్ నుంచి హైదరాబాద్లోని గంజాయి స్మగ్లర్లకు ఇచ్చేందుకు వచ్చినట్లు చెప్పింది. గంజాయి తరలించిన మ హిళపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు ఆమెను శంషాబాద్ ఆర్జిఐఎ పోలీసులకు అప్పగించారు. గంజాయి విలువ కోటి రూపాయల వరకు వుంటుందని పోలీసులు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :
డిజిటల్ అరెస్టు పేరిట వృద్ధుడిని బెదరించి రూ.42 లక్షల దోపిడీ

