Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గోబర్ధన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

గోబర్ధన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

వార్త 14 hrs ago

Gobardhan Scheme : దేశంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరతను అధిగమించి, స్వచ్ఛ ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా ‘గోబర్ధన్’ (GOBARdhan) పథకం విస్తరణకు రూ. 23,731 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిధులతో దేశవ్యాప్తంగా బయోగ్యాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తిని, పంపిణీ వ్యవస్థను పెద్దఎత్తున ప్రోత్సహించనున్నారు. పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత పెరగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం సమకూరనుంది. అలాగే, సబ్సిడీ వంటగ్యాస్‌పై భారాన్ని తగ్గించి, పర్యావరణహిత స్వచ్ఛ ఇంధన వాడకాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఈశాన్య భారతంలో మౌలిక వసతులు: అస్సాంలో రూ. 8,970 కోట్లతో ఫోర్-లేన్ రహదారి

ఇంధన రంగంతో పాటు ఈశాన్య రాష్ట్రాల రవాణా రంగానికి సైతం కేంద్ర క్యాబినెట్ పెద్దపీట వేసింది. అస్సాం రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ‘బైహతా చరియాలీ’ నుంచి ‘తేజ్‌పూర్’ వరకు రూ. 8,970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ప్రతిపాదిత్ నాలుగు వరసల (Four-lane) జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలు, పర్యాటకం, వాణిజ్య రంగాలు గణనీయంగా పుంజుకోనున్నాయి. సరిహద్దు ప్రాంతాలకు సరుకుల రవాణాను వేగవంతం చేసేందుకు కూడా ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమైనదిగా నిలవనుంది.

సెప్టెంబర్ 1 నుంచి తిరుపతికి ఎయిర్ ఇండియా సర్వీస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha