Tirupati : తిరుపతి వెళ్లే వారికి ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతికి ఎయిర్ ఇండియా విమానం సర్వీస్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
సెప్టెంబర్ 1 నుంచి ఈ విమాన సర్వీస్ ప్రారంభం కానున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. తిరుపతితో పాటు మరో ఐదు నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తాజా నెట్‌వర్క్ విస్తరణతో ఈ విమానయాన సంస్థకు 48 దేశీయ, 16 అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపిస్తోంది. ఈ సర్వీసులతో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన వ్యాపార, పారిశ్రామిక, సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలకు రవాణా మెరుగుపడుతుందని వివరించింది. తిరుపతితో పాటు ఔరంగాబాద్, కోయంబత్తూర్, జామ్‌నగర్, జోధ్‌పూర్, మదురైకు నూతన ఎయిర్ ఇండియా సర్వీసులు 2026 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం, తక్కువ ఖర్చులో విమాన సేవలు అందించడం కోసం కొత్త సర్వీసులు ప్రారభిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటిచింది.
Read Also: Swiggy Target: స్విగ్గీ బిగ్ టార్గెట్: 2031 నాటికి రూ. 10,000 కోట్ల లాభమే లక్ష్యం!
Tirupati
Tirupati : మెట్రో నగరాలైన చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబైలతో అనుసంధానం
ఈ 6 నగరాల నుంచి కీలకమైన మెట్రో నగరాలైన చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబైలతో అనుసంధానం ఉంటుందని వివరించింది. ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ ప్రస్తుతం 500 రోజు వారీ విమాన సర్వీసులను నడిపిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 100కు పైగా విమానాలు అందుబాటులో ఉన్నాయి. కాగా తిరుమలకు దేశ నలు మూలల నుంచి భారీగా భక్తులు వెళ్తారు. అయితే తిరుపతి వెళ్లే వారు ఎక్కువగా రోడ్డు మార్గం, రైలు మార్గాల్లో వెళ్తుంటారు. అయిత ఈ మధ్య కాలంలో విమానంలో వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది.
Epaper: epaper.vaartha.com

