Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గోదావరి పుష్కరాలకు వెయ్యి కోట్ల నిధులు

గోదావరి పుష్కరాలకు వెయ్యి కోట్ల నిధులు

వార్త 1 month ago

Godavari Pushkaralu 2027:తెలంగాణ రాష్ట్రంలో జరిగే గోదావరి పుష్కరాలు 2027 వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు ఘనంగా జరిగేలా చూడాలని ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఏడు వరకు పుష్కరాలు జరగనున్నాయి. దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు.

Read also: Charminar Temple: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి అద్భుత చరిత్ర

 Grand organization of the 2027 Godavari Pushkarams

వెయ్యి కోట్ల నిధులతో అభివృద్ధి పనులు

గోదావరి తీరం వెంబడి ఘాట్లు తాగునీరు విద్యుత్ పారిశుద్ధ్యం రవాణా వైద్య సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం వేవెయ్యి కోట్ల నిధులు కేటాయించింది. ఆగస్టు చివరి నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ మొదటివారంలో పనులు ప్రారంభించాలి. వివిధ శాఖల సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సంకల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేడుకలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

Godavari Pushkaralu 2027:పనుల పర్యవేక్షణ ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు

అధికారులు ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షించాలని వర్చువల్ మీటింగ్స్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే వినతులపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని తెలిపారు. పనుల వివరాలు తెలుసుకోవడానికి ప్రత్యేక డాష్ బోర్డ్ రూపొందించాలని ఆదేశించారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని నిర్ణయించారు.

Epaper: epaper.vaartha.com

కాంగ్రెస్‌ పార్టీ నేతలను విమర్శించలేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha