Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట. రేట్లు మారలేదు

గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట. రేట్లు మారలేదు

వార్త 2 months ago

అక్షయ తృతీయకు బంగారం ధరలు స్థిరం

Gold rate today : అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈరోజు శుభవార్త అందింది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి.

గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ, ఈరోజు మాత్రం ఎలాంటి మార్పు లేదు.

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు ఇటీవల బంగారం ధరలపై ప్రభావం చూపించాయి. అయితే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచినట్లు ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ వాణిజ్య పరిస్థితులు కొంత స్థిరపడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4831 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Read Also : Delimitation Bill : వీగిపోయిన బిల్లు.. కేంద్రం నెక్స్ట్ ఏంచేయబోతుంది ?

 Gold rate today

హైదరాబాద్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,780 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.1,42,800 వద్ద ఉంది. మరోవైపు వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద ట్రేడవుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఈరోజు బంగారం ధర ఎంత పెరిగిందంటే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha