Viral Job Notification : మన దేశంలో చదువు సరిగ్గా అబ్బకపోతే 'ఏ పనీ రాకపోతే పశువులు కాయడానికే పనికొస్తావు' అంటూ పెద్దలు తిట్టడం మనం తరచూ వింటూనే ఉంటాం.
కానీ ప్రస్తుత రోజుల్లో గొర్రెలు కాయడానికి కూడా విదేశాల్లో ఐటీ ఉద్యోగాల రేంజ్‌లో భారీ డిమాండ్ ఉందనే విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘వైబో’ (Weibo)లో జువో జియోవోయాంగ్ అనే వ్యక్తి పెట్టిన ఒక వినూత్న ఉద్యోగ ప్రకటన నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. తన ఫామ్‌లో గొర్రెలు కాసేందుకు ఇద్దరు వ్యక్తులు కావాలంటూ ఆయన పోస్ట్ చేయగా.. కేవలం కొద్ది రోజుల్లోనే దీనికి ఏకంగా 5.9 కోట్ల (59 Million)కు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ఉద్యోగం కోసం సుమారు 700 మందికి పైగా నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు పోటీ పడుతూ దరఖాస్తు చేసుకోవడం విశేషం.
Read Also : ట్రంప్ శాంతి మంత్రంపై రిపబ్లికన్ల తిరుగుబాటు.. 60 రోజుల కాల్పుల విరమణ విపత్తేనా?

కార్పొరేట్ ఒత్తిళ్లకు చెక్.. ఐటీ ఉద్యోగులు గొర్రెల కాపరులుగా మారడానికి కారణాలివే!
ఈ సాధారణ ఉద్యోగానికి అంతటి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం అందులో ఆఫర్ చేసిన భారీ జీతభత్యాలే. ఈ గొర్రెల కాపరి ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు ఏకంగా రూ.1.1 లక్షల (11,000 యువాన్లు) జీతంతో పాటు ఉచిత వసతి సదుపాయం, రోజువారీ నిత్యావసర సరకులను కూడా ఉచితంగా అందిస్తామని సదరు యజమాని ప్రకటించారు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేసే ఐటీ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. రోజువారీ కార్పొరేట్ కంపెనీల ఒత్తిళ్లు, టార్గెట్లు, డెడ్‌లైన్లతో విసిగిపోయిన యువత.. ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో, ఎలాంటి మానసిక ఒత్తిడి లేని ఇలాంటి గ్రామీణ వృత్తుల వైపు మొగ్గు చూపుతున్నారని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వింత పోకడ ప్రస్తుత ఆధునిక ఉద్యోగాలలోని ఒత్తిడిని, మారుతున్న యువత ఆలోచనా విధానాన్ని స్పష్టం చేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
హార్ముజ్ జలసంధిలో హైడ్రామా: రెండు దేశాల మైండ్ గేమ్‌తో ప్రపంచ దేశాల్లో తీవ్ర గందరగోళం!

