Khushbu Daughter Avantika Marriage: కోలీవుడ్ సీనియర్ స్టార్ కపుల్ ఖుష్బూ సుందర్, దర్శకుడు సుందర్ సిల ఇంట్లో పెళ్లి వేడుకలు అంబరాన్ని అంటాయి. వారి పెద్ద కుమార్తె అవంతిక వివాహం గోవాలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
చెన్నైకి చెందిన శ్రవణ్ శ్రీనివాసన్ అనే యువకుడిని అవంతిక గత కొంతకాలంగా ప్రేమిస్తున్నట్లు వార్తలు రాగా, ఇరు కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించి పెద్దల సమక్షంలో ఈ వివాహాన్ని జరిపించారు. గురువారం జరిగిన ఈ రాయల్ వెడ్డింగ్‌కు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Khushbu’s daughter’s wedding in Goa… Veteran Tollywood heroes create a buzz in traditional panche attire!
Khushbu Daughter Avantika Marriage: ఒకే ఫ్రేమ్‌లో చిరు, నాగ్, వెంకీ..
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు దిగ్గజాలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, అక్కినేని నాగార్జున దంపతులు, విక్టరీ వెంకటేష్ దంపతులు విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పెళ్లి వేడుకలో చిరంజీవి, వెంకటేష్‌లు సాంప్రదాయబద్ధంగా పంచెకట్టు ధరించి సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఒకప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సరసన ఖుష్బూ స్టార్ హీరోయిన్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీరి కుటుంబాల మధ్య ఉన్న బలమైన అనుబంధం ఈ వేడుకతో మరోసారి స్పష్టమైంది. అలాగే స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఈ పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవి పక్కన కూర్చుని సందడి చేస్తూ కనిపించారు.

