Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓ ఇంటివాడైన భారత క్రికెటర్ ఆకాశ్ దీప్

ఓ ఇంటివాడైన భారత క్రికెటర్ ఆకాశ్ దీప్

వార్త 1 week ago

Akash Deep Wedding : భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ తన జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ఓ ఇంటివాడయ్యారు. ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలోని ఒక ప్రముఖ లగ్జరీ హోటల్‌లో అక్షితా రాజ్‌తో ఆయన వివాహం అత్యంత వైభవంగా జరిగింది.

రెండు రోజుల క్రితమే బిహార్‌లోని ఆకాశ్ దీప్ స్వగ్రామంలో సంప్రదాయబద్ధంగా వివాహ వేడుకలు (ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్స్) ప్రారంభం కాగా, నిన్న ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక కనులపండువగా ముగిసింది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహ వేడుకలో ఆకాశ్ దీప్ తన ప్రాంతీయ రాజపుత్ర సంప్రదాయాల ప్రకారం చేతిలో పవిత్రమైన ఖడ్గంతో (కత్తితో) రాయల్ లుక్‌లో మెరిసిపోయారు. వధువు అక్షితా రాజ్ కూడా సాంప్రదాయ లెహంగాలో అందరినీ ఆకట్టుకున్నారు.

మైదానాన్ని మరిపించిన క్రికెటర్ల డాన్సులు

క్రికెట్ పిచ్‌పై ప్రత్యర్థులను వణికించే పలువురు భారతీయ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు ఈ పెళ్లి వేడుకలో సందడి చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా పెళ్లికి ముందు జరిగిన సంగీత్, బారాత్ ఈవెంట్లలో టీమిండియా స్టార్ క్రికెటర్లు బాలీవుడ్ పాటలకు అదిరిపోయే డాన్సులు వేస్తూ మైదానాన్ని మరిపించేలా జోష్ నింపారు. ఆకాశ్ దీప్ కూడా తన సహచరులతో కలిసి స్టెప్పులేస్తూ కెమెరాలకు చిక్కారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ నూతన వధూవరులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha