బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆగ్రహం
Cow slaughter ban act: హైదరాబాద్లో చట్ట విరుద్ధంగా గోవులను తరలించడం, గోవధకు పాల్పడటం అత్యంత దారుణమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయమై గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో గోవధ నిషేధ చట్టాలు అమలులో ఉన్నప్పటికీ కొందరు కావాలనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన గోమాతను కాపాడుకోవడానికి, చట్టాన్ని రక్షి ంచడానికి శాంతియుతంగా ప్రయత్నిస్తున్న గోరక్షకులను, బిజెపి కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం తగదన్నారు. గో అక్రమరవాణాను అడ్డుకుం టారన్న నెపంతో బైండోవర్లు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విరుచుకుపడ్డారు.
Read Also : Korrameenu Aqua Cluster: రాష్ట్రంలో కొర్రమీను ఆక్వా క్లస్టర్ ఏర్పాటు!
Police fail to enforce cow slaughter ban law
Cow slaughter ban act: కఠినమైన క్రిమినల్ కేసులు
చట్టాన్ని ఉల్లంఘించే వారిని వదిలేసి, గోవులను కాపాడాలని చూస్తున్న రక్షకులపై, బిజెపి కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, బైండోవర్లను రద్దు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గోవధ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ కేంద్రాలను ఏర్పాటుచేయాలన్నారు. చట్టాన్ని ధిక్కరించి గోవధకు పాల్పడే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.
రాష్ట్రవ్యాప్త హెచ్చరిక
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఒక వర్గానికి కొమ్ముకాస్తూ గోరక్షకులను వేధించడం సరికాదని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “గోమాత హిందువుల జీవన విధానంలో ఒక పవిత్రమైన భాగం. పండుగల పేరుతో గోవధను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు. శాంతియుత వాతావరణానికి భంగం కలిగించాలని చూసే శక్తులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. అని డిమాండ్ చేశారు. తక్షణమే అరెస్టు చేసిన బిజెపి కార్యకర్తలను విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా.. సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రాంచందర్రావు సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా సినీ సెల్ కోకన్వీనర్ వైభవ సూర్య మాట్లాడుతూ.. దేశభక్తి భావజాలం, అభివృద్ధి రాజకీయాల పట్ల ఆకర్షితులై పలువురు కళాకారులు బిజెపిలో చేరుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా అనేక మంది సినీ, టీవీ రంగ ప్రముఖులు పార్టీలో చేరనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు మనోహర్, సీనియర్ నటుడు శరత్, సీనియర్ నటి పద్మరేఖ, సినీ సెల్ సభ్యురాలు పూజిత తదితరులు బీజేపీలో చేరారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

