Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్రంలో కొర్రమీను ఆక్వా క్లస్టర్ ఏర్పాటు!

రాష్ట్రంలో కొర్రమీను ఆక్వా క్లస్టర్ ఏర్పాటు!

వార్త 2 days ago

Korrameenu Aqua Cluster: రాష్ట్రంలో కొర్రమీను చేపకు ఉన్న విపరీతమైన డిమాండ్ను గుర్తించిన మత్స్యశాఖ ప్రత్యేక అక్వా క్లస్టర్ను ఏర్పాటు చేసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంగా కొనసాగే ఈ క్లస్టర్లో పొరుగున ఉన్న జిల్లాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసింది.

తెలంగాణ మత్స్యశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ప్రణాళికలతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో కొర్రమీను సాగు సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది. దీంతో చేపల పెంపకందారులకు అవసరమైన సాంకేతికత, నాణ్యమైన మేత, మార్కెటింగ్ సదుపాయాలు ఒకే చోట లభించనున్నాయి.

Read Also : TG First Glass Bridge: లవ్ సింబల్ ఆకారంలో తొలి గ్లాస్‌ బ్రిడ్జి.. ఎక్కడో తెలుసా!

 Korraminu Aqua Cluster to be established in the state!

Korrameenu Aqua Cluster: ఆధునిక పద్ధతుల్లో సాగు

ఒకప్పుడు నీటి ఎద్దడితో అల్లాడిన ఉత్తర తెలంగాణ ఇప్పుడు జలకళతో ఉరకలేస్తోంది. లోయర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి వంటి భారీ ప్రాజెక్టుల పుణ్యమా అని కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలు నిత్యం నీటితో కళకళలాడుతున్నాయి. ఈ అపారమైన మంచినీటి వనరులే ఇప్పుడు కొర్రమీను సాగుకు అతిపెద్ద సానుకూల అంశాలుగా మారాయి. స్థానిక చెరువులు, రిజర్వాయర్లలో ఆధునిక పద్ధతుల్లో (కేజ్ కల్చర్ వంటి విధానాల ద్వారా) ఈ చేపల పెంపకాన్ని ముమ్మరం చేస్తున్నారు.

రవాణా ఖర్చులు తగ్గి వినియోగదారులకు తక్కువ ధరకే లభ్యత

ప్రస్తుతం మార్కెట్లో కొర్రమీను ధర కేజీ రూ.300 నుంచి రూ. 600 పైమాటే. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా ఖర్చులు, బార్డర్ ట్యాక్సులు తోడవడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు కరీంనగర్ హబ్లోనే స్థానికంగా టన్నుల కొద్దీ ఉత్పత్తి కానుండటంతో రవాణా ఖర్చులు తగ్గి వినియోగదారులకు తక్కువ ధరకే తాజా కొర్రమీను అందుబాటులోకి రానుంది. మరోవైపు, స్థానిక మత్స్యకారులకు, యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, వారి ఆర్థిక తల రాత మారనుంది.

కేవలం తెలంగాణ మార్కెట్ అవసరాలు తీర్చడమే కాకుండా భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు కూడా కొర్రమీనును ఎగుమతి చేసేలా ప్రభుత్వం పక్కా కార్యచరణను సిద్ధం చేసింది. ఇందుకోసం కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ (శీతలీకరణ కేంద్రాలు), ప్యాకింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2016 లోనే తెలంగాణ రాష్ట్ర చేపగా గుర్తింపును దక్కించుకున్న కొర్రమీను, ఇప్పుడు కరీంనగర్ వేదికగా సరికొత్త ఆర్థిక విప్లవానికి తెరలేపనుంది. త్వరలోనే “కరీంనగర్ కొర్రమీను” బ్రాండ్ దేశవ్యాప్తంగా మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha