Norway Chess Champion: ప్రపంచ ఛెస్ వేదికపై సరికొత్త రికార్డులతో భారత కీర్తిపతాకాన్ని ఎగురవేసిన యంగ్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద (R. Praggnanandhaa) కు స్వరాష్ట్రంలో ఘన సన్మానం దక్కింది.
ప్రతిష్టాత్మక నార్వే ఛెస్ 2026 (Norway Chess 2026) టోర్నమెంట్‌లో చారిత్రాత్మక టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందను.. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (CM Vijay) ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు (SDAT) తరఫున ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల నగదు బహుమతి (Cash Award) చెక్కును సీఎం విజయ్ స్వయంగా అందజేశారు.
Read also:Shreyas Iyer T20 Captaincy:ఎవరి నీడలోనూ ఉండను.. మరొకరిలా మారే ప్రసక్తే లేదు!
సచివాలయంలో ఫ్రెండ్లీ మ్యాచ్ - ఆకట్టుకున్న సీఎం విజయ్
CM Joseph Vijay Sports Incentives SDAT
చెన్నైలోని ప్రభుత్వ ప్రధాన సచివాలయంలో (Secretariat) ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ప్రజ్ఞానంద తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సమావేశం కేవలం అధికారిక ముచ్చటకే పరిమితం కాలేదు, ఒక ఆసక్తికర మలుపు తీసుకుంది. సీఎం విజయ్ మరియు 20 ఏళ్ల ప్రజ్ఞానంద కాసేపు ముఖాముఖి కూర్చుని చెస్ బోర్డుపై ఫ్రెండ్లీ గేమ్ ఆడారు. సీఎం విజయ్ బోర్డుపై పావులు కదుపుతూ ఎత్తులు వేయగా, గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద చిరునవ్వుతో వాటిని గమనించడం అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన ఈ సూపర్ టోర్నీలో ప్రజ్ఞానంద అసాధారణ ప్రదర్శన చేశాడు. ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్, హోమ్ ఫేవరెట్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను క్లాసికల్ ఫార్మాట్‌లో ఏకంగా రెండుసార్లు ఓడించి సంచలనం సృష్టించాడు. అంతేకాకుండా, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్‌పై కూడా విజయం సాధించాడు. టోర్నీ ఆఖరి 4 రౌండ్లలో వరుస విజయాలతో దూసుకెళ్లి 18 పాయింట్లతో నార్వే ఛెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.
Norway Chess Champion: క్రీడలకు తమిళనాడు సర్కార్ పెద్దపీట
ప్రజ్ఞానంద సాధించిన ఘనత తమిళనాడుకు మాత్రమే కాకుండా యావత్ భారతదేశానికి గర్వకారణమని సీఎం విజయ్ కొనియాడారు. ప్రజ్ఞానంద ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వ ‘ఎలైట్ స్కీమ్’ (Elite Scheme) లో భాగస్వామిగా ఉన్నాడు. ఈ పథకం కింద అతనికి ఏటా రూ. 30 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. యువ చెస్ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ‘హోమ్ ఆఫ్ ఛెస్’ అకాడమీని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి ఆధవ్ అర్జున, క్రీడా ప్రాధికార సంస్థ సభ్య కార్యదర్శి జె. మేఘనాథ రెడ్డి (IAS) తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com

