Suryakumar Yadav Unfollows MI: భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, 'మిస్టర్ 360' సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెరీర్ ప్రస్తుతం తీవ్ర గడ్డు కాలాన్ని (Lean Patch) ఎదుర్కొంటోంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత టీ20 జట్టు కెప్టెన్సీతో పాటు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కోల్పోయిన సూర్యకు.. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోనూ గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. తాను ఎంతో కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians – MI) ఫ్రాంచైజీకి ఆయన గుడ్ బై చెప్పనున్నారనే ఊహాగానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
Read also:Shubman Gill: టెస్ట్ కెప్టెన్‌గా వెయ్యి పరుగులు పూర్తి చేసిన శుభ్‌మన్ గిల్
ఇన్‌స్టాగ్రామ్ క్లీన్ అప్ - ఫ్రాంచైజీతో విభేదాలు నిజమేనా?
సూర్యకుమార్ యాదవ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ప్రొఫైల్ నుండి ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన దాదాపు అన్ని పోస్టులను, ఫొటోలను అకస్మాత్తుగా తొలగించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సూర్యకుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ముంబై ఇండియన్స్ అధికారిక పేజీతో పాటు, జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అకౌంట్‌ను కూడా అన్‌ఫాలో (Unfollow) చేసినట్లు అభిమానులు గుర్తించారు. ప్రస్తుతం అతని ప్రొఫైల్‌లో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలతో కలిసి ఉన్న ఒకే ఒక్క పాత ఫొటో మాత్రమే మిగిలి ఉండటం బంధం తెగిపోయిందనే వాదనలకు బలం చేకూరుస్తోంది. 2018లో కేకేఆర్ నుండి ముంబై ఇండియన్స్‌కు వచ్చిన సూర్య ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే, ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ లో సూర్య దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం 20.77 సగటుతో 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ పేలవ ఫామ్ కారణంగానే ముంబై యాజమాన్యం వచ్చే మెగా వేలానికి (Mega Auction) ముందే అతనిపై వేటు వేసి, ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నట్లు సమాచారం.
Suryakumar Yadav Unfollows MI: సూర్యకుమార్‌కు అన్యాయం జరిగింది - ఆర్. అశ్విన్ ఫైర్
సూర్యకుమార్‌ను అటు టీమిండియా మేనేజ్‌మెంట్, ఇటు ముంబై ఫ్రాంచైజీ పక్కనబెట్టడంపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R. Ashwin) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సూర్యకు మద్దతుగా నిలుస్తూ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. “గత 15-18 నెలలుగా సూర్యకుమార్ బ్యాటర్‌గా లీన్ ఫేస్ ఎదుర్కొంటున్న మాట వాస్తవమే కావచ్చు. కానీ ఒక కెప్టెన్‌గా అతను దేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచకప్ (T20 World Cup) అందించాడన్న నిజాన్ని సెలక్టర్లు ఎలా విస్మరిస్తారు? వరల్డ్ కప్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోయినా, కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపించాడు. టీమ్‌లోని ఉత్తమ బ్యాటర్, బౌలర్‌కు ఇచ్చే గౌరవం.. ఒక విన్నింగ్ కెప్టెన్‌కు ఇవ్వరా?” అని అశ్విన్ ఘాటుగా ప్రశ్నించాడు. జట్టు నుండి తొలగించినందుకు బాధపడే పూర్తి హక్కు సూర్యకు ఉందని, అతని స్థానంలో ఎవరున్నా ఆ వేదన అనుభవిస్తారని అశ్విన్ స్పష్టం చేశాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

