Water tanker demand:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా నీళ్ల ట్యాంకర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీలు, వాణిజ్య భవనాల వద్ద ట్యాంకర్లు వరుస కడుతున్నాయి.
భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో బోర్లన్నీ ఎండిపోయాయి. నూతన బోర్లు వేయడానికి ప్రభుత్వం అనుమతులు నిలిపివేయడంతో ప్రజలు పూర్తిగా జలమండలి నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. నల్లా నీరు అరకొరగా రావడంలో ప్రెషర్ సమస్యల కారణంగా సిటీ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా హైదరాబాద్‌లో నీటి ట్యాంకర్ల డిమాండ్ అసాధారణ స్థాయికి చేరుకుంది.
Paradise Hotel: ప్యారడైజ్ హోటల్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?
High prices for tankers
రికార్డు స్థాయిలో పెరుగుతున్న రోజువారీ బుకింగ్స్ సంఖ్య
ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ట్యాంకర్ల కోసం భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. రోజురోజుకు బుకింగ్స్ సంఖ్య రెట్టింపు అవుతోంది. ముఖ్యంగా వెస్ట్ సిటీ ప్రాంతాలు, విలీన మున్సిపాలిటీల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో కనిపించే డిమాండ్ ఇప్పుడు అక్టోబర్ నెలలోనే కనిపిస్తోంది. గత 7 రోజుల నుంచి రోజువారీ బుకింగ్స్ 7000 సంఖ్యను దాటాయి. అక్టోబర్ నెలలో ఈ స్థాయిలో బుకింగ్స్ నమోదు కావడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. ట్యాంకర్ బుక్ చేసిన 3 లేదా 4 రోజుల తర్వాత ఇళ్లకు చేరుతుండటంతో ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు.
Water tanker demand:అక్రమ దందాలు అలాగే ప్రైవేట్ ట్యాంకర్ల అధిక ధరలు
ట్యాంకర్ల డిమాండ్ పెరగడంతో కొందరు అక్రమ దందాలకు తెరతీశారు. బుకింగ్ టోకెన్ వచ్చాక వినియోగదారులకు చిన్న మిస్డ్ కాల్ ఇచ్చి, స్పందించలేదనే పేరుతో ట్యాంకర్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ ధరను 2000 నుంచి 3000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. జలమండలి ట్యాంకర్లు 3 రోజులు దాటినా రాకపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించి జనం డబ్బులు నష్టపోతున్నారు. ధనవంతులు నివసించే ప్రాంతాలకు ఎక్కువ సమయం నీటిని వదులుతూ, బస్తీలకు మాత్రం 10 నిమిషాలకు మించి నీరు ఇవ్వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను నివారించి నీటి సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.
Epaper: epaper.vaartha.com

