Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుడ్ న్యూస్.. ఏపీలో రూ. 100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

గుడ్ న్యూస్.. ఏపీలో రూ. 100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

వార్త 2 weeks ago

AP Hereditary Land Registration:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసేలా ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత సరళతరం చేసింది.

తాత, తండ్రి లేదా తల్లి మరణించిన తర్వాత వారి వ్యవసాయ భూములను వారసుల పేరు మీదకు మార్చుకోవడానికి గతంలో చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెడుతూ, కేవలం వంద రూపాయల స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. పది లక్షల రూపాయల లోపు విలువైన భూములకు వంద రూపాయలు, అంతకు మించిన విలువ ఉంటే వెయ్యి రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధానం వల్ల రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు సులభంగా అందుతాయి. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు ఆటో మ్యుటేషన్ కూడా జత చేయడంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

Read also: Andhra Pradesh Crime: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఆత్మహత్య

 AP Hereditary Land Registration

రిజిస్ట్రేషన్ తోనే ఆటో మ్యుటేషన్ పూర్తి

వారసత్వ ఆస్తుల బదిలీలో అత్యంత కీలకమైన మార్పుగా ప్రభుత్వం ఆటో మ్యుటేషన్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మ్యుటేషన్ కోసం సచివాలయాల్లో కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం సమర్పించి, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తుల విభజన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవ్వగానే, ఆ వివరాలు ఆటోమేటిక్ గా రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్ అవుతాయి. వీలునామా లేని సందర్భాల్లో కుటుంబ సభ్యులు ఆస్తులను పంచుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జత చేస్తే సరిపోతుంది. ఈ విధానం వల్ల భూ యజమానులకు ఎంతో సమయం ఆదా అవ్వడంతో పాటు పారదర్శకత పెరుగుతుంది.

AP Hereditary Land Registration:రైతులకు అందిన భారీ ఊరట

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతు కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో భూమి వారసులకు సంక్రమించినా రికార్డుల్లో మార్పులు జరగక చాలా మంది ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఆటోమేటిక్ గా మ్యుటేషన్ ప్రక్రియ పూర్తవుతుండటంతో, భూమిపై రైతులకు పూర్తిస్థాయి హక్కులు లభిస్తాయి. సకాలంలో పట్టాదారు పాసుపుస్తకాలు అందడం వల్ల బ్యాంక్ రుణాలు, ఇతర ప్రభుత్వ రాయితీలు పొందడం రైతులకు సులభం అవుతుంది. సిసిఎల్ఏ జయలక్ష్మి జారీ చేసిన ఈ కొత్త ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పూర్తిగా తొలగిస్తాయి. వారసత్వ భూములకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా, ఇకపై నిమిషాల్లోనే రికార్డులు అప్‌డేట్ అయ్యేలా సాంకేతికతను ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది.

Epaper: epaper.vaartha.com

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్‌లు ఉచితం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha