Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుడ్ న్యూస్.. జూన్ 21 న నీట్ విద్యార్థులకు ఆర్టీసీ ఫ్రీ

గుడ్ న్యూస్.. జూన్ 21 న నీట్ విద్యార్థులకు ఆర్టీసీ ఫ్రీ

వార్త 2 weeks ago

NEET Exam 2026:తెలంగాణ ప్రభుత్వం నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

జూన్ 21న జరగనున్న ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పరీక్ష రాసే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.

Read also: Kaudipally news: కౌడిపల్లిలో ఆకస్మిక తనిఖీలు!

 NEET students free RTC travel 2026

హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు

విద్యార్థులు తమ ప్రయాణ సమయంలో ఆర్టీసీ బస్సులో కండక్టరుకు లేదా డ్రైవరుకు తమ హాల్ టికెట్ చూపించాల్సి ఉంటుంది. హాల్ టికెట్ చూపిన వెంటనే విద్యార్థులకు టికెట్ లేకుండానే ఉచిత ప్రయాణ అనుమతి లభిస్తుంది. పరీక్ష కేంద్రానికి వెళ్లే సమయంలో అలాగే పరీక్ష అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చే సమయంలో కూడా ఈ సౌకర్యం వర్తిస్తుంది. విద్యార్థులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, నిబంధనల ప్రకారం హాల్ టికెట్ మాత్రమే వెంట ఉంచుకుంటే సరిపోతుంది.

NEET Exam 2026: మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులలో కల్పించిన ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని నీట్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేయాలని మంత్రి కోరారు.

Epaper: epaper.vaartha.com

ఉప్పల వెంకటేష్ సేవలు అభినందనీయం.. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha