Kodali Nani : మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తానని కొడాలి నాని గతంలో వ్యాఖ్యానించారని గుర్తుచేస్తూ..
ముందు ఆ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు బూట్లు తుడిచిన తర్వాతే రాజకీయాల గురించి మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
గుడివాడలో అడుగు పెట్టాలని సవాల్
గత అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ ప్రజలు కొడాలి నానిని 53 వేల ఓట్ల భారీ తేడాతో ఓడించారని వెనిగండ్ల రాము అన్నారు. అయినా ఆయనకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. విజయవాడలో మీడియా సమావేశాలు పెట్టడం కాకుండా, దమ్ముంటే గుడివాడలో అడుగు పెట్టాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం గుడివాడలో నానికి రాజకీయ స్థానం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
Read also: AP Noise Pollution: ప్రార్థనా మందిరాల శబ్ద కాలుష్యంపై రఘురామకృష్ణంరాజు స్ట్రాంగ్ వార్నింగ్!
Kodali Naniనానిని ప్రజలు మర్చిపోయారన్న రాము
గుడివాడ ప్రజలు కొడాలి నానిని ఎప్పుడో మర్చిపోయారని వెనిగండ్ల రాము అన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా ఇంకా విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. గుడివాడ రాజకీయాలపైనే పట్టులేని వ్యక్తి రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. కొడాలి నాని ఇక కార్పొరేటర్‌గా కూడా గెలవలేడని, ఇది తన సవాల్ అని స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also
ఈ ఏడాది చివరికి మూడు పోర్టులు ప్రారంభం.. మంతెన రామరాజు సంచలన ప్రకటన

