Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేవలం రూ. 949 కే టైప్-సి ఛార్జింగ్‌తో 'ఏస్ 3 హీరా' లాంచ్

కేవలం రూ. 949 కే టైప్-సి ఛార్జింగ్‌తో 'ఏస్ 3 హీరా' లాంచ్

వార్త 2 weeks ago

Itel Ace 3 Heera Launch India : భారతీయ ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో ఐటెల్ (itel) బ్రాండ్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. పాత మైక్రో-యుఎస్‌బీ (Type-B) ఛార్జింగ్ యుగానికి స్వస్తి పలుకుతూ, తన అన్ని ఫీచర్ ఫోన్లలో టైప్-సి (Type-C) ఛార్జింగ్ పోర్ట్‌ను ప్రవేశపెట్టిన దేశంలోనే మొదటి బ్రాండ్‌గా అవతరించింది.

ఇందులో భాగంగా ‘ఏస్ 3 హీరా’ (Ace 3 Heera) మోడల్‌ను కేవలం ₹949 అందుబాటు ధరలో భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. బ్లూ, పర్పుల్, బ్లాక్ రంగుల్లో లభించే ఈ ఫోన్ ద్వారా స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్ రెండింటికీ ఒకే టైప్-సి కేబుల్ వాడుకునే వెసులుబాటు వినియోగదారులకు లభించనుంది. అంతేకాకుండా, తయారీ లోపాలు ఏవైనా ఉంటే ఏడాదితో పాటు కౌంటర్ రీప్లేస్‌మెంట్ వారంటీని కూడా సంస్థ ఆఫర్ చేస్తోంది. సరికొత్త సాంకేతికతతో వినియోగదారుల రోజువారీ అవసరాలను మరింత సులభతరం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఐటెల్ ఇండియా సీఈఓ అరిజీత్ తలపాత్ర వెల్లడించారు.

అధునాతన ఫీచర్లు, అద్భుతమైన పనితీరు: ఫీచర్ ఫోన్ సెగ్మెంట్‌లో నయా ట్రెండ్

ఐటెల్ ఏస్ 3 హీరా ఫోన్ కేవలం ఛార్జింగ్‌కే పరిమితం కాకుండా పలు ఆకర్షణీయమైన ఫీచర్లతో రూపొందించబడింది. ఇందులో ఏఐ బ్యాటరీ ఆప్టిమైజేషన్ మరియు సూపర్ బ్యాటరీ మోడ్‌తో కూడిన 1000mAh బ్యాటరీని అమర్చారు, ఇది సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. వినోదం కోసం ఇయర్‌ఫోన్లు లేకుండా వినే వైర్‌లెస్ ఎఫ్‌ఎమ్ రేడియో (రికార్డింగ్ సదుపాయంతో), బ్లూటూత్ కనెక్టివిటీ, ఆటో కాల్ రికార్డింగ్, కింగ్ టాకర్ వాయిస్ అసిస్టెంట్ మరియు మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 32జీబీ వరకు స్టోరేజ్ పెంచుకునే సౌకర్యం కలవు. సీఎమ్‌ఆర్ (CMR) నివేదిక ప్రకారం మన్నిక, విశ్వసనీయత మరియు నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్‌లో ఐటెల్ అగ్రస్థానంలో నిలిచింది. పాత ఛార్జర్ల తలనొప్పిని తగ్గించి, తక్కువ ధరలో ప్రీమియం అనుభవాన్ని అందించే ఈ ఫోన్ భారతీయ సాధారణ వినియోగదారులకు అత్యంత ప్రాక్టికల్ ఎంపికగా నిలవనుంది.

ఏపీకి రిలయన్స్ సరికొత్త సంచలనం.. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha