Dailyhunt
గుజరాత్‌లో ఎద్దు బీభత్సం: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి.. కాళ్లతో తొక్కిన వైనం

గుజరాత్‌లో ఎద్దు బీభత్సం: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి.. కాళ్లతో తొక్కిన వైనం

వార్త 2 weeks ago

Rajkot: గుజరాత్‌లోని రాజ్‌కోట్ సమీపంలో ఉన్న వెరావల్ (Veraval) లో గురువారం సాయంత్రం ఒక భీకర ఘటన చోటుచేసుకుంది. జనసాంద్రత కలిగిన వీధిలో ఒక ఎద్దు (Stray Bull) బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేసింది.

ఈ షాకింగ్ దృశ్యాలు అక్కడ ఉన్న సిసిటివి (CCTV) కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Read Also: kaleshwaram project : కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వేడి

Rajkot: అసలేం జరిగింది?

వెరావల్ ప్రధాన రహదారిపై ఒక వ్యక్తి తన మోపెడ్ (Moped) పై సాధారణంగా వెళ్తుండగా, ఎదురుగా ఉన్న ఎద్దు ఒక్కసారిగా అతనిపైకి దూసుకొచ్చింది. ఎద్దు తన కొమ్ములతో బలంగా ఢీకొట్టడంతో ఆ వ్యక్తి బైక్‌తో సహా కిందపడిపోయాడు. అంతటితో ఆగకుండా, ఆ జంతువు అతనిపైకి ఎక్కి కాళ్లతో తొక్కుతూ తీవ్రంగా గాయపరిచింది. ఈ భయానక దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. చేతికి దొరికిన కర్రలు, రాళ్లతో ఆబోతును భయపెట్టి అక్కడి నుండి పంపించి వేశారు. పదుల సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఆ వ్యక్తిని ప్రాణాలతో కాపాడగలిగారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

హిమాచల్ అసెంబ్లీ సంచలన బిల్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha