Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వేడి

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వేడి

వార్త 2 months ago

Kaleshwaram project : కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై రాజ్యసభలో తీవ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి మరియు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై సురేశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కిషన్ రెడ్డి విమర్శలు

సురేశ్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ పనికిరాకుండా పోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. నిపుణుల కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పిందని పేర్కొన్నారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా ఉపయోగించిందని ఆరోపించారు. ఇంజినీర్ల సలహాలు కూడా తీసుకోకుండా ప్రాజెక్టును ప్రారంభించారని విమర్శించారు. రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కూడా మండిపడ్డారు.

Read Also:Medchal Doctor Suicide: భార్య వేధింపులు భరించలేక..డాక్టర్ ఆత్మహత్య

 kaleshwaram project

సురేశ్ రెడ్డి స్పందన

ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన సురేశ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో కేసీఆర్ పోరాటం కీలకమని అన్నారు. ప్రాంతాలు వేరైనా అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని కేసీఆర్ అప్పట్లో చెప్పినట్లు గుర్తుచేశారు. తెలంగాణ అనుమతి లేకుండానే కొన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారని ఆరోపించారు. ఏడు మండలాల విలీనం సమయంలో సరైన చర్చ జరగలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గత పన్నెండు సంవత్సరాలుగా తెలంగాణకు తగిన సహాయం చేయలేదని కూడా విమర్శించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha