Dailyhunt
గుమ్మడిదలలో ఘనంగా అంబేద్కర్ జయంతి: రక్తదాన శిబిరానికి విశేష స్పందన

గుమ్మడిదలలో ఘనంగా అంబేద్కర్ జయంతి: రక్తదాన శిబిరానికి విశేష స్పందన

వార్త 1 week ago

Ambedkar Jayanti Gummadidala: డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జెన్ బ్లడ్ సెంటర్ చారిటబుల్ ట్రస్ట్, పంజాగుట్ట ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.

అంబేద్కర్ సంఘం నాయకులు ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేసి విజయవంతం చేశారు. స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ చిమ్ముల సంధ్య రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, మండల తహసిల్దార్ పరమేశం, గుమ్మడిదల ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ పరమేశం మాట్లాడుతూ డా. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ దశరథ్ మాట్లాడుతూ రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సమాజంలో రక్తదానంపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని సూచించారు.

Read Also:Medak: PRTU ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

Ambedkar Jayanti Gummadidala: గుమ్మడిదల ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని, ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు బాధ్యతగా వ్యవహరించాలని చెబుతూ యువతతో రోడ్డు భద్రత కోసం ప్రమాణం చేయించారు.

సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సమాజ సేవలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా ఒకరి ప్రాణాలను మరొకరు కాపాడగలమని, ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో ఐక్యత, మానవత్వం పెరుగుతాయని తెలిపారు.ఈ రక్తదాన శిబిరంలో జెన్ బ్లడ్ సెంటర్ చారిటబుల్ ట్రస్ట్ వైద్య బృందం సేవలు అందించింది. డాక్టర్లు ఆమని, శ్రీనివాస్, యాదయ్య, మహేష్, శివ, దత్తు తదితరులు రక్తదాన ప్రక్రియను పర్యవేక్షిస్తూ దాతలకు వైద్య సేవలు అందించారు.

గుమ్మడిదల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తుడుం రవి మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని అందరూ నాయకులు రక్తదానం చేసే దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు తుడుం శ్రీనివాస్, బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు పలుగు గోవర్ధన్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు కావలి ఐలేష్,
గుమ్మడిదల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తుడుము రవి, ఉపాధ్యక్షుడు డప్పు శ్రీనివాస్, నాయకులు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక యువకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

భూ హక్కులకు భరోసా: ఏడాది పూర్తి చేసుకున్న భూ భారతి చట్టం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha