Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'కరుప్పు' చిత్రం స్పెషల్ షోలకు తమిళనాడు గ్రీన్ సిగ్నల్!

'కరుప్పు' చిత్రం స్పెషల్ షోలకు తమిళనాడు గ్రీన్ సిగ్నల్!

వార్త 1 week ago

Karuppu Movie: ప్రముఖ నటుడు సూర్య, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ డ్రామా 'కరుప్పు' విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా మే 14, 15 తేదీల్లో చిత్ర యూనిట్ అభ్యర్థన మేరకు ఈ స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ నిర్ణయంతో సూర్య అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Read Also: IBomma Re-entry: మళ్లీ మొదలైన ఐబొమ్మ హవా

 Special screenings of Trisha-Suriya’s new film ‘Karuppu’ allowed in Tamil Nadu

Karuppu Movie: రోజుకు ఐదు షోలు.. కఠిన నిబంధనలు

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ రెండు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు. అయితే, ఈ ప్రత్యేక ప్రదర్శనల సమయంలో థియేటర్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలకు విఘాతం కలగకుండా చూడాలని ప్రభుత్వం యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో ప్రేక్షకులను పలకరించనుంది.

కోలీవుడ్‌లో సీఎం విజయ్‌కు కృతజ్ఞతలు

గత కొంతకాలంగా తమిళనాడులో పెద్ద సినిమాలకు కూడా ప్రత్యేక ప్రదర్శనల విషయంలో ఆంక్షలు ఉండేవి. అయితే, చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ ఈ చిత్రానికి అనుమతులు ఇవ్వడంపై పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతినిచ్చినందుకు గాను ముఖ్యమంత్రికి చిత్ర నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. సూర్య, త్రిష కాంబినేషన్ కు తోడు ఆర్జే బాలాజీ కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha