Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుంటూరు, అమరావతి దారులలో నిలిచిన రాకపోకలు

గుంటూరు, అమరావతి దారులలో నిలిచిన రాకపోకలు

వార్త 2 weeks ago

Amaravati floods:మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం అతలాకుతలమైంది. కొండవీటి వాగుతో పాటు కోటేళ్ల వాగు, ఎర్రవాగు, పాలవాగు, పేరమ్మ వాగులకు భారీగా వరద పోటెత్తడంతో రాజధానిని చుట్టుముట్టాయి.

గత రెండు రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో గుంటూరు నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులు తాడేపల్లి మీదుగా 35 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది.

Vegetable prices: దీపావళి ధమాకా.. కూరగాయల ధరలు తగ్గాయ్!

 Traffic halted due to flooding in the Kondaveedu stream!

వంద గ్రామాలకు నిలిచిన రాకపోకలు

లాం వాగు, పెదపరిమి కోటేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటు రాజధాని ప్రాంతం, ఇటు అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మండలాల వైపు వెళ్లే సుమారు వంద గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి రాగానే లాం చప్టా వద్ద వంతెన నిర్మిస్తామని శిలాఫలకం వేసినప్పటికీ, ఇప్పటివరకు ఆ నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, తుపాను కారణంగా తాడికొండ నుంచి పెదపరిమి, తుళ్లూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు మరమ్మతుల కారణంగా కంతేరు రోడ్డు వైపు మళ్లించినా, అక్కడ ఎర్రవాగు పొంగి ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.

వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు

నీరుకొండ, నిడమర్రు, తాడికొండ మధ్య పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. లాం వద్ద వరద ఉధృతికి వేలాది ఎకరాల్లో సాగు చేసిన పత్తి, మిర్చి, వరి, అపరాల పంటలు దెబ్బతినడంతో రైతులు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. కొండవీటి వాగు సమస్య ఏటా వేధిస్తున్నప్పటికీ ప్రభుత్వ ముందస్తు చర్యలు కొరవడటంతో రైతులు ప్రతిఏటా కోట్లలో నష్టపోతున్నారు.

Amaravati floods:ప్రభుత్వ చర్యలపై విమర్శలు

ఎగువన కొండవీటి వాగును వెడల్పు చేసి నీటి ప్రవాహాన్ని దిగువకు పంపాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. వాగు ప్రక్షాళనను గాలికొదిలేసి, రాజధానిలో రిజర్వాయర్ల పేరుతో రూ.వేల కోట్లు ఖర్చు చేస్తూ నీరుకొండ వద్ద 4 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 2 టీఎంసీలు, వడ్డమాను వద్ద 3 టీఎంసీల నీటిని నిల్వ చేసే పనులను కొనసాగిస్తుండటం గమనార్హం. తుపాను తీవ్రతను ముందుగా గ్రహించిన ప్రభుత్వం, మంగళవారం అర్ధరాత్రి నీరుకొండ రిజర్వాయర్‌లోకి వరద నీటిని మళ్లించి చేతులు దులుపుకుంది. అయితే, ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ముందుకు కదలకపోవడంతో రైతులు నిండా మునిగిపోయారు. రాజధాని పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి రాజధానికి కనీసం సరైన రోడ్డు మార్గాన్ని కూడా ప్రభుత్వం నిర్మించలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

మురసు తుఫాను ఎఫెక్ట్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha