Guntur Incident: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో కాలనీలో నీటి మోటార్ వేసే విషయంలో 21వ వార్డు తెలుగుదేశం పార్టీ (TDP) సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులకు, స్థానిక మహిళకు మధ్య చిన్నపాటి ఘర్షణ మొదలైంది.
ఈ గొడవ కాస్తా ముదరడంతో మల్లెల మూర్తి కుటుంబం అత్యంత దారుణంగా ప్రవర్తించింది. కొందరు హిజ్రాలను సైతం తోడు తెచ్చుకుని సదరు మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఉదంతం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘోర దాడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది.
Read Also : Guntur Incident:గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
Women’s Commission takes a serious view of the Guntur incident involving a woman!
Guntur Incident: ఘటనపై ఆరా తీసిన మహిళా కమిషన్
ఈ అమానుష ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ స్పందించారు. గుంటూరులో జరిగిన ఈ క్రూరమైన దాడి వివరాలను, దానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా దాడులు మహిళల భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని, ఇలాంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు.
బాధిత మహిళకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని రాయపాటి శైలజ డిమాండ్ చేశారు. సమాజంలో ఇటువంటి అరాచకాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసు యంత్రాంగాన్ని కోరారు. నిందితులను త్వరగా గుర్తించి, వారికి కఠిన శిక్ష పడేలా చట్టాన్ని ప్రయోగించాలని, బాధితురాలికి కమిషన్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు.
గుంటూరులో అమానుషం.. మహిళను వివస్త్రను చేసి అవమాన పరిచిన టీడీపీ నేత కుటుంబం

