Retirement Age : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (APTWREIS)లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు తీపి కబురు అందించింది.
సొసైటీ పరిధిలోని టీచింగ్ మరియు నాన్-టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ (రిటైర్మెంట్) వయసును ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ అధికారిక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జులై నెల నుంచి పదవీ విరమణ చేయాల్సి ఉన్న ఉద్యోగులకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని, వారిని 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు విధుల్లో కొనసాగించేందుకు అనుమతించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ సాధారణ ఉద్యోగులతో సమానంగా గురుకుల సిబ్బందికి కూడా ఈ ప్రయోజనం చేకూరడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

కొత్త పోస్టులపై ఆంక్షలు – ఆర్థిక భారం లేకుండా చర్యలు
ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచినప్పటికీ, దానివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఉద్యోగుల సర్వీసు కొనసాగింపు కారణంగా కొత్త పోస్టులేవీ సృష్టించకూడదని సొసైటీ యంత్రాంగాన్ని ఆదేశించింది. అలాగే జీవో 45 (GO 45) పరిమితులకు లోబడే ఈ ప్రక్రియను నిర్వహించాలని, నిర్దేశిత బడ్జెట్ హద్దులను దాటి ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడకుండా జాగ్రత్తలు వహించాలని సూచించింది. ఈ నిర్ణయం ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సేవలు గిరిజన విద్యార్థులకు మరికొంత కాలం అందుబాటులో ఉండనున్నాయి.
స్నాప్‌చాట్‌లో పరిచయం.. యువతి నుంచి రూ.1.50 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు

