Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గూస్‌బంప్స్ తెప్పిస్తున్న మంచు మనోజ్ 'డేవిడ్ రెడ్డి' టీజర్..

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న మంచు మనోజ్ 'డేవిడ్ రెడ్డి' టీజర్..

వార్త 4 days ago

David Reddy Teaser: మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డేవిడ్ రెడ్డి టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో మనోజ్ "డేవిడ్ రెడ్డి" అనే శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు.

గతంలో విడుదలైన వార్ డాగ్ వీడియో, ఫస్ట్ లుక్ అన్నీ మంచి అంచనాలు పెంచగా, ఇప్పుడు వచ్చిన టీజర్ ఆ హైప్‌ను మరింత పెంచింది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. దసరా సీజన్‌లో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథ 1897 నుండి 1920 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో జరుగుతుంది.

Read Also : NTR Dragon Movie: యూట్యూబ్‌ను షేక్ చేసిన 'డ్రాగన్' గ్లింప్స్.. 24 గంటల్లో 64 మిలియన్ వ్యూస్!

 Manchu Manoj’s ‘David Reddy’ teaser is out.

David Reddy Teaser: కథలో అసలు ట్విస్ట్ ఏంటి?

ఈ టీజర్‌లో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా బలమైన హిస్టారికల్ ఎలిమెంట్స్‌ను కూడా జోడించారు. డేవిడ్ రెడ్డి సృష్టిస్తున్న సంచలనంపై అప్పట్లోనే జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి జాతీయ నాయకులు కూడా దృష్టి పెట్టినట్టు చూపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు బ్రిటిష్ అధికారులు సైతం అతని ప్రభావంపై చర్చించుకుంటూ ఉంటారు. అయితే దేశం కోసం పోరాడే డేవిడ్ రెడ్డి.. 'దేశద్రోహి'గా ఎందుకు మారాల్సి వచ్చింది? ప్రజలు అతన్ని ఎందుకు తప్పుబట్టారు? అనే ప్రశ్నలు కథపై ఉత్కంఠను పెంచుతున్నాయి. డేవిడ్ రెడ్డి ఒక్కడే 50 బెటాలియన్లకు చెందిన 2000 మంది సైనికులతో పోరాడే సన్నివేశాలు టీజర్‌లో హైలైట్‌గా ఉన్నాయి. అయితే అతను దేశద్రోహిగా ఎందుకు మారాడు? ప్రజలు అతన్ని ఎందుకు పట్టించుకోవాలి అనే ప్రశ్నలు కథలో ఉత్కంఠను పెంచుతున్నాయి.

తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విదేశీ నటి మరియా ర్యాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రమ్యకృష్ణ, సముద్రఖని, అభయ్ డియోల్, కాంచన వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి అత్యున్నత సాంకేతిక విలువలలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాబోయే దసరా పండుగ సీజన్‌లో థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha