Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూట్యూబ్‌ను షేక్ చేసిన 'డ్రాగన్' గ్లింప్స్.. 24 గంటల్లో 64 మిలియన్ వ్యూస్!

యూట్యూబ్‌ను షేక్ చేసిన 'డ్రాగన్' గ్లింప్స్.. 24 గంటల్లో 64 మిలియన్ వ్యూస్!

వార్త 4 days ago

NTR Dragon Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'డ్రాగన్' బాక్సాఫీస్ వద్దకు రాకముందే రికార్డుల వేట మొదలుపెట్టింది.

మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన ‘డ్రాగన్’ ప్రిల్యూడ్ గ్లింప్స్ యూట్యూబ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన తొలి 24 గంటల్లోనే ఏకంగా 64 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, భారత సినీ చరిత్రలో ఒకే యూట్యూబ్ ఛానెల్‌లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న గ్లింప్స్‌గా ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.

Read Also : Dhurandhar movie : 'ధురంధర్' రా అన్‌కట్ వెర్షన్ లీక్.. ఆ రెండు ఓటీటీల్లో ఒకేసారి విధ్వంసం!

 Glimpses of ‘Dragon’ that shook YouTube.. 64 million views in 24 hours!

NTR Dragon Movie: లూగర్‌గా ఎన్టీఆర్..

మొత్తం 4 నిమిషాల 28 సెకన్ల సుదీర్ఘ నిడివితో కూడిన ఈ గ్లింప్స్‌ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. 1967 నాటి ప్రపంచ నల్లమందు వ్యాపార సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఇందులో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే అత్యంత క్రూరమైన, డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.

ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ

ఈ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ తాను తీసిన చిత్రాల్లోకెల్లా ఇది అత్యంత దేశభక్తి కలిగిన చిత్రమని, అయితే ఇందులో ఎన్టీఆర్ పాత్ర మాత్రం చాలా డార్క్‌గా ఉంటుందని వెల్లడించారు. కేజీఎఫ్, సలార్ చిత్రాల తరహాలోనే ఇందులో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తోంది. అలాగే బిజు మీనన్, గురు సోమసుందరం, అశుతోష్ రాణా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలి గ్లింప్స్‌తోనే ప్రపంచవ్యాప్తంగా అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లిన 'డ్రాగన్'.. రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమా వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha