Raja Shivaji Movie Update: భారతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా 'రాజా శివాజీ' చిత్రం రూపొందుతోంది.
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఈ చిత్రంలో శివాజీ మహారాజ్ పాత్రను పోషించడమే కాకుండా, స్వయంగా దర్శకత్వం కూడా వహిస్తున్నారు. రితేష్ భార్య, నటి జెనీలియా దేశ్‌ముఖ్ (ముంబై ఫిల్మ్ కంపెనీ), జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Read Also:Tovino Thomas-NTR: 'డ్రాగన్' నుండి టోవినో థామస్ ఔట్.. కారణం ఇదే!
Raja Shivaji Movie Update: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న టీజర్: సంజయ్ దత్ వాయిస్ ఓవర్ హైలైట్
‘రాజా శివాజీ’ టీజర్‌లో నాటి మరాఠా సామ్రాజ్య పరిస్థితులను, స్వరాజ్యం కోసం శివాజీ చేసిన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా టీజర్‌లో సంజయ్ దత్ వాయిస్‌తో వినిపించే “మరాఠాల తలరాతలో చావు రాసి ఉందా.. లేదా బానిసత్వమా?” అనే డైలాగ్‌కు, రితేష్ దేశ్‌ముఖ్ ‘స్వరాజ్యం’ అంటూ ఇచ్చే సమాధానం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అద్భుతమైన విజువల్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ విజువల్స్ ఈ సినిమాకు అందిస్తుండగా, అజయ్-అతుల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం 2026 మే 1న (మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరాఠీ, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

