Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్వాలియర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్!

గ్వాలియర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్!

వార్త 1 week ago

Madhya Pradesh crime: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కిడ్నాప్‌కు గురైన ఒక మైనర్ బాలికపై బెంగళూరులో సామూహిక అత్యాచారం జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ అమానుష కేసులో బెంగళూరు పోలీసులు ఇద్దరు మహిళలతో పాటు మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది జనవరిలో గ్వాలియర్‌కు చెందిన బాలికను కొందరు నిందితులు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి బెంగళూరుకు తరలించారు. కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి, ఫిబ్రవరిలో గ్వాలియర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెను కొందరు దుండగులు ప్రలోభపెట్టి బెంగళూరుకు తీసుకెళ్లారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

Read Also: Breaking News: Kakinada Road Accident: ఉపాధి హామీ కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ.. నలుగురు దుర్మరణం!

 Gwalior girl gang-raped in Bengaluru!

Madhya Pradesh crime: బెంగళూరులో బాలిక గుర్తింపు..

తల్లి ఫిర్యాదుతో పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. బాలిక బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి, అక్కడి పోలీసుల సహాయంతో ఆమెను సురక్షితంగా రక్షించారు. ఆ సమయంలో బాలికను బందీగా ఉంచిన ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలికను గ్వాలియర్‌లోని ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో నెలరోజుల పాటు ఉంచి, కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లికి వివరించింది. బెంగళూరులో తనను ఒక గదిలో బందీగా ఉంచడమే కాకుండా, పలువురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పి కన్నీరు పెట్టుకుంది. ఈ ఘాతుకానికి ఇద్దరు మహిళలు కూడా సహకరించారని బాలిక చెప్పడంతో, తల్లి మార్చిలో మరోసారి పోలీసులను ఆశ్రయించింది.

ఐదుగురు నిందితుల అరెస్ట్..

బాధిత బాలిక సమాచారం ఆధారంగా పోలీసులు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్, కిడ్నాప్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఆరో నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తెగిపడ్డ అపార్ట్‌మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నేతలకు గాయాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha