Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్యాస్ కనెక్షన్‌కు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే కనెక్షన్ రద్దు !

గ్యాస్ కనెక్షన్‌కు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే కనెక్షన్ రద్దు !

వార్త 1 week ago

Gas ekyc : చాలా ప్రభుత్వ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనర్హులను ఏరియాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పలు సంస్కరణాలు తీసుకొచ్చింది.

ఇందులో భాగంగా ఈ కేవైసీ తీసుకొచ్చింది. ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలని సూచించింది. అర్హులైన గ్యాస్ వినియోగదారులను గుర్తించడంతో పాటు అర్హత లేని వారిని తొలగించేందుకు ఈ కేవైసీ ప్రక్రియ తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి చాలా మంది కస్టమర్లు ఈకేవైసీ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వినియోగదారుల నుంచి సరైనా స్పందన రాలేదు. దీంతో కంపెనీలు త్వరలోనే నిలిపివేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఈ కేవైసీ చేసుకోని వారికి గ్యాస్​ సరఫరా ఆగిపోయే అవకాశం ఉంటుందని డీలర్స్ హెచ్చరిస్తున్నారు.

Read Also: Public Examination Amendment Bill: పేపర్ లీక్ చేస్తే పదేళ్ల జైలు శిక్ష

 Gas ekyc

Gas ekyc : డిమాండ్ ​కు సరిపడా గ్యాస్ సరఫరా లేదు

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 లక్షల కనెక్షన్లుండగా 70 శాతం మంది వినియోగదారులు మాత్రమే ఈ కేవైసీ చేసుకున్నట్లు డీలర్లు చెబుతున్నారు. మరోపక్క డిమాండ్ ​కు సరిపడా గ్యాస్ సరఫరా కాకపోవడంతో కొన్ని కంపెనీలు ఈ కేవైసీ సాకుతో సిలిండర్ల డెలివరీ నిలిపివేసే చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 2024 జూన్​ లో వినియోగదారులు ఈ కేవైసీ చేసుకోవాలని ఆయిల్​ కంపెనీలు తెలిపాయి. ఇందుకు సంవత్సర కాలం పాటు సమయం ఇచ్చారు. ఆ తర్వాత నిరంతర ప్రక్రియ పేరుతో దీన్నీ కొనసాగిస్తున్నారు. అయినా వినియోగదారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని డీలర్లు చెబుతున్నారు. 2014లోనూ ఈకేవైసీ మొదలుపెట్టి ఐదు సంవత్సరాల పాటు కొనసాగించారు. ఈసారి మాత్రం సంవత్సరాల ముగించేలా ఉన్నారని డీలర్లు అంచనా వేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

సోషల్ మీడియాలో 'E20 జనతా పార్టీ' డిజిటల్ ఉద్యమం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha