LPG Shortage: హైదరాబాద్ లో ఎల్పిజి ఆటోరిక్షాలు ఎదుర్కొంటున్న వ్యాస్ కొరతపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి లేఖ రాశారు.
ఆటో కార్మికుల సమస్యలను పరిష్కారం వేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అదనపు ఎల్పిజి సరఫరా చేయాలని డిమాండ్ వేశారు. గృహ అవసరాల కోసం డొమెస్టిక్ ఎల్పీజీ సరఫరా 100 కొనసాగించాలని కోరారు. కమర్షియల్ ఎల్పిజి పంపిణీపై కేంద్ర మార్గదర్శ కాలు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఆటో ఎల్పిజి రంగం తీవ్రంగా ప్రభావితమైందన్నారు.
Read Also: Moinabad Farmhouse Drugs Case: రోహిత్ సహా ముగ్గురికి మళ్లీ కస్టడీ
LPG shortage for gas-powered autos
Minister Uttam’s letter to Union Minister Hardeep Singh
LPG Shortage: తెలంగాణలో ఆటో ఎల్పిజి రంగంపై ప్రభావం
కాగా.. తెలంగాణలో సుమారు 1 లక్ష ఎల్పీజీ ఆటోరిక్షాలు రోడ్లపై నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 110 ప్రైవేట్ ఎల్పీజీ ఔట్లెట్లు ఉన్నాయి. రోజుకు సుమారు 55 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పిజి కొరత ఏర్పడింది. అనేక ప్రైవేట్ ఔట్ లెట్లు డ్రై అవుట్ పరిస్థితి నెలకొంది. ప్రజా రవాణాలో అంతరాయం, ప్రజల్లో ఆందోళన కొన
సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కంపెనీలకు గ్యాస్ సరఫరా అంతరాయం ఏర్పడిందని లేఖలో మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వరంగ ఔట్ లెట్లలో ఆటో ఎల్పిజి అందుబాటు ఉంచాలని విజప్తి చేశారు. ప్రైవేట్ కంపెనీలకు తక్షణ సరఫరా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఔట్లెట్లలో లీటరు రూ.75, ప్రైవేట్ ఔట్ లెట్లలో లీటర్ కు రూ.93 వరకు విక్రయిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై నియంత్రణ చర్యలు అవసరమని, కేంద్రం తక్షణ జోక్యం వల్ల ప్రజా రవాణా సేవలు నిలకడగా కొనసాగుతాయన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
అయ్యో ఎంత పని చేసావ్ తల్లి! ఆమె కఠిన నిర్ణయం వెనక కన్నీటి వ్యధ

