Moinabad Farmhouse Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్లోని రోహిత్ రెడ్డి ఫాం హౌస్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో అరెస్టయిన తాండూరు మాజీ ఎంఎల్ఎ, బిఆర్ఎస్ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి ఆయన సోదరుడు రితేష్రెడ్డి, ఢిల్లీ రియ ల్టర్ నమిత్ శర్మలకు రెండవ దఫాగా మూడు రోజుల కస్టడీకి ఇస్తూ రాజేంద్రనగర్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
ఈ నెల 14వ తేదీ రాత్రి మొయినాబాద్లో ని అజీజ్నగర్లో గల రోహిత్ రెడ్డి ఫాం హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీని ఈగల్ పోలీసులతో పాటు చేవెళ్ల పోలీసులు రట్టు చేయడం తెలిసిందే.
Read Also : Telangana Scholarship Date Extended: స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
Three including Rohit remanded in custody
నాలుగు రౌండ్లు కాల్పులు జరపడం
ఈ సందర్భంగా 11 మంది పట్టుబడగా ఇందులో రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఏలూరు ఎంపి పుట్టా మహేష్ యాదవ్, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవిలు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడం విదితమే. అయితే పోలీసులు దాడిచేసిన సమయంలో రితేష్ రెడ్డికి చెందిన లైసెన్స్ రివాల్వర్ను నమిత్ శర్మ తీసుకుని పోలీసులను భయపెట్టేందుకు గాలిలో నాలుగు రౌండ్లు కాల్పులు జరపడం సంచలనం రేపింది. పోలీసులపై కాల్పులు జరపాలని రోహిత్ రెడ్డి పురిగొల్పినట్లు పోలీసులు నిర్దారించారు. దీంతో రోహిత్ రెడ్డి తన ఫాం హౌస్లో అసాంఘీక కార్యకలాపాలకు స్థానం కల్పించినందుకు, తన లైసెన్స్ రివ్వార్ను మరో వ్యక్తికి ఇచ్చినందుకు రితేష్ రెడ్డిని, మరొకరి రివాల్వర్చేత పోలీసులపై కాల్పులు జరిపినందుకు నమిత్ శర్మను పోలీసులు అరెస్టు చేశారు.
Moinabad Farmhouse Drugs Case: ఐదు రోజుల పాటు కస్టడీ
పోలీసులు అరెస్టు చేసిన రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలు రెండు వారాలుగా చంచల్గూడ జైల్లో వున్నారు. ఈ కేసులో వీరిని మరింతగా విచారించేందుకు మార్చి 23వ తేదీన పోలీసుల వినతి మేరకు రాజేంద్రనగర్ కోర్టు మూడు రోజుల కస్టడీ ఇవ్వగా మార్చి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వీరిని శంషాబాద్ రూరల్ పోలీసు స్టేషన్లో వుంచి విచారించారు. కస్టడీ ముగిసిన తరువాత మళ్లీ జైలుకు తరలించారు. అయితే మొదటి దఫా కస్టడీలో ముగ్గురు పెద్దగా వివరాలు వెల్లడించక పోవడంతో రెండవ దఫాగా ఐదు రోజుల పాటు కస్టడీకి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం వాదనలు ముగియగా మంగళవారం మధ్యాహ్నం కోర్టు తీర్పు చెబుతూ ముగ్గురు నిందితులను మూడు రోజుల కస్టడీకి ఇస్తూ ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వీరిని బుధవారం ఉదయం చ ంచల్గూడ జైలు నుంచి మొయినాబాద్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. శుక్రవారం నాడు తిరిగి చంచల్గూడ జైలుకు తరలించనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

