Dailyhunt
హాల్ టికెట్ ఇవ్వలేదని  విద్యార్థి ఆత్మహత్య!

హాల్ టికెట్ ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య!

వార్త 6 days ago

Hayathnagar BTech Student Suicide: హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కళాశాల యాజమాన్యం వేధింపులు తాళలేక ఓ బీటెక్ విద్యార్థి తన ప్రాణాలను తీసుకున్నాడు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Read Also: Uttar Pradesh crime: ఘోరం.. 17 ఏళ్ల బాలుడి పై యువతి అత్యాచారం!

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య!

హయత్‌నగర్ పరిధిలో నివాసముంటున్న ప్రణీత్ అనే విద్యార్థి, ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Hayathnagar BTech Student Suicide: యాజమాన్యం వేధింపులే కారణమా?

ప్రణీత్ మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడికి హాజరు శాతం (Attendance) తక్కువగా ఉందన్న నెపంతో, పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ ఇవ్వకుండా యాజమాన్యం వేధించిందని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హాల్ టికెట్ కోసం కోరినప్పుడు అందరి ముందు అవమానకరంగా మాట్లాడటంతో ప్రణీత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని వారు తెలిపారు.

పోలీసుల దర్యాప్తు

విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాలేజీ యాజమాన్యం తీరుపై విచారణ ప్రారంభించారు. ఒకవేళ హాజరు తక్కువగా ఉన్నా, విద్యార్థిని తీవ్రంగా అవమానించడం వల్లే ఈ అఘాయిత్యం జరిగిందా అనే కోణంలో సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కవల కుమార్తెలను గొంతు కోసి హత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha