SS Rajamouli: బ్రెజిల్‌లో అత్యంత వైభవంగా జరిగిన 50వ సావో పాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన హాలీవుడ్ ప్రవేశం గురించి మరియు తదుపరి చిత్రాల గురించి ఆయన కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు.
‘RRR’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో సాధించిన ఘన విజయం తర్వాత తనకు హాలీవుడ్ నుంచి అనేక పెద్ద అవకాశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు.
Adarsha Kutumbam: వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. ట్రైలర్ రిలీజ్!
Rajamouli provides clarity on his Hollywood entry
SS Rajamouli: ప్రస్తుతం పూర్తి దృష్టి ‘వారణాసి’ పైనే!
హాలీవుడ్ అవకాశాలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో తెలకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’పైనే తన పూర్తి దృష్టి ఉందని రాజమౌళి స్పష్టం చేశారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు తాను మరే ఇతర ప్రాజెక్ట్ వైపు చూడనని ఆయన తెలిపారు.
ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న ‘వారణాసి’ చిత్ర షూటింగ్ మరో 10 రోజుల్లో పూర్తిగా ముగియనుందని జక్కన్న తెలిపారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా పూర్తయిన తర్వాత మాత్రమే హాలీవుడ్ సినిమాలపై లేదా ఇతర అంతర్జాతీయ ప్రాజెక్టులపై ఒక తుది నిర్ణయం తీసుకుంటానని రాజమౌళి చెప్పారు. రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలతో మహేష్ బాబు అభిమానుల్లో ‘వారణాసి’ చిత్రంపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.
Epaper: epaper.vaartha.com

