Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హీరోలకే కాదు.. నయనతారకు కూడా 60 అడుగుల కటౌట్‌తో హంగామా

హీరోలకే కాదు.. నయనతారకు కూడా 60 అడుగుల కటౌట్‌తో హంగామా

వార్త 3 hrs ago

Mookuthi Amman 2: సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార మరోసారి వార్తల్లో నిలిచారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల విడుదల సమయంలో కనిపించే భారీ కటౌట్లు, అభిమానుల హంగామా ఇప్పుడు ఆమె విషయంలోనూ కనిపిస్తున్నాయి.

నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ భక్తిరస చిత్రం 'మూకుత్తి అమ్మన్ 2' (తెలుగులో 'మహా శక్తి') ప్రమోషన్లలో భాగంగా తమిళనాడులోని వేల్స్ థియేటర్స్ వద్ద ఆమె 60 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఒక హీరోయిన్‌కు ఈ స్థాయిలో కటౌట్ ఏర్పాటు చేయడం తమిళ సినీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది. దీంతో నయనతార క్రేజ్, ఆమెకు ఉన్న అభిమానుల ఆదరణ మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

Adarsha Kutumbam: వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. ట్రైలర్ రిలీజ్‌!

 Not just for heroes-Nayanthara also gets a grand tribute with a 60-foot cutout.

Mookuthi Amman 2: సరికొత్త కథతో ‘మూకుత్తి అమ్మన్ 2’.. తెలుగులో ‘మహా శక్తి’

గతంలో వచ్చిన ‘మూకుత్తి అమ్మన్’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి’) బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సీక్వెల్‌కు సీనియర్ కమర్షియల్ దర్శకుడు సుందర్.సి దర్శకత్వం వహించారు. ఈ రెండో భాగం మొదటి కథకు కొనసాగింపు కాదని, పూర్తిగా సరికొత్త కథాంశంతో వస్తోందని చిత్ర బృందం స్పష్టం చేసింది. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని 'మహా శక్తి' అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ద్విపాత్రాభినయం, భారీ తారాగణం, వంద కోట్ల బడ్జెట్

ఈ సినిమాలో నయనతార అమ్మవారిగానే కాకుండా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గానూ ద్విపాత్రాభినయంలో మెరవనున్నారు. తన బిడ్డను శత్రువుల నుంచి రక్షించే క్రమంలో ఒక రాణి చేసిన త్యాగం, ఆ బాలుడికి అండగా నిలవడానికి మూకుత్తి అమ్మన్ తిరిగి రావడం, దుష్ట శక్తులను సంహరించేందుకు సాగించే భీకర పోరాటం చుట్టూ ఈ కథ నడుస్తుంది. అమ్మవారి పాత్ర కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో నయనతార దాదాపు ఒక నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష ఆచరించినట్లు నిర్మాత ఇషారి కె. గణేష్ వెల్లడించారు.

వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రెజీనా కసాండ్రా, కన్నడ నటుడు దునియా విజయ్ శక్తిమంతమైన విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు ఊర్వశి, యోగి బాబు, అభినయ, రామచంద్ర రాజు (గరుడ రామ్), సింగంపులి వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. రాక్‌స్టార్ హిప్‌హాప్ తమిళా అందించిన స్వరాలు, బీజీఎం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి.

నవంబర్ 6న గ్రాండ్ రిలీజ్

దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి ముందే 60 అడుగుల భారీ కటౌట్‌తో నయనతార సృష్టించిన ఈ సరికొత్త రికార్డు తమిళ సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Epaper: epaper.vaartha.com

మ్యాచో స్టార్ గోపీచంద్ 'సింగా' ఇంటెన్స్ పోస్టర్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha