Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

వార్త 2 weeks ago

Former MLA Bhupal Reddy: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, వాగ్దానాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నారాయణఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే ఎం.

భూపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలను ఎండగడుతూ పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ నేతలు, గద్దెనెక్కిన తర్వాత వాటిని తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

మహిళలు, వృద్ధులు, విద్యార్థులను మోసం చేశారు - 420 హామీలపై శ్వేతపత్రం ఇవ్వాలి

ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రధాన హామీలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. మహిళలకు నెలకు రూ. 2,500 మహాలక్ష్మి ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు, వృద్ధులు మరియు వితంతువులకు నెలకు రూ. 4 వేల ఆసరా పింఛన్, దివ్యాంగులకు రూ. 6 వేల పింఛన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు పూర్తిస్థాయిలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన 420 హామీల్లో ఇప్పటివరకు ఎన్నింటిని నిజాయతీగా అమలు చేశారో ప్రజల ముందు స్పష్టమైన లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Former MLA Bhupal Reddy: స్థానిక ఎమ్మెల్యే గొంతు ఎందుకు మూగబోయింది? - పోరాటం కొనసాగుతుంది

నారాయణఖేడ్ నియోజకవర్గ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే తీరును కూడా భూపాల్‌రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. “ప్రజలు గెలిపించిన స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీలోనూ, ప్రభుత్వంలోనూ నియోజకవర్గ సమస్యలపై, హామీల అమలుపై ఎందుకు గొంతు విప్పడం లేదు? మీ నిశ్శబ్దానికి కారణమేమిటి?” అంటూ నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, మండల పార్టీ నాయకులు సురేష్‌గౌడ్, బి. దత్తు, సుభాష్, వెంకటరెడ్డి, మాణిక్‌రెడ్డి, కోణం అంజయ్యతో పాటు పలు గ్రామాల బీఆర్‌ఎస్ శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha