Telangana: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత భవిష్యత్తు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
సమాజంలో సమూల మార్పు తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
Read Also: Sangareddy Agriculture:రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఘనంగా నిర్వహణ
Telangana: If the promises are not fulfilled, stone them: Kavitha is sensational!
అమరవీరుల స్థూపం సాక్షిగా శపథం
తన రాజకీయ నిబద్ధత గురించి మాట్లాడుతూ ఆమె ఒక సంచలన శపథం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే, తనను అమరవీరుల స్థూపానికి కట్టేసి రాళ్లతో కొట్టవచ్చని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రయోజనాల కోసం ఎంతటి కఠిన నిర్ణయానికైనా తాను సిద్ధమని ఈ ప్రకటన ద్వారా ఆమె సంకేతాలిచ్చారు.
కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా.. ప్రజలకు క్షమాపణ
గతంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగిన పొరపాట్లపై కూడా కవిత స్పందించారు. పార్టీలో జరిగిన తప్పులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, తాను ఆ విషయాలపై మరింత గట్టిగా పోరాడలేకపోయానని ఆమె అంగీకరించారు. అందుకే ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. తన పోరాట పటిమలో ఎక్కడో లోపం జరిగిందన్న ఉద్దేశంతోనే ఈ క్షమాపణలు కోరుతున్నట్లు ఆమె వివరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :
ఆధ్యాత్మికతకు… అన్నదానలకు పెట్టింది పేరు.. మన సిద్దిపేట: హరీష్ రావు

