Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఘనంగా నిర్వహణ

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఘనంగా నిర్వహణ

వార్త 1 month ago

Sangareddy Agriculture: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు డా.

కిరణ్ రెడ్డి, డా. చిరంజీవి పాల్గొని రైతులకు పలు సూచనలు అందించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు బాగేష్, అంజుమ, గ్రామ సర్పంచ్ ప్రవీణ్, అభ్యుదయ రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Read Also :Census 2027: సంగారెడ్డిలో జనగణన-2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం

Sangareddy Agriculture: ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా మాట్లాడి పంటల సాగులో యూరియా, ఎరువులు, పురుగుమందులను పరిమిత పరిమాణంలో వినియోగించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చని, మట్టికి ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. అధిక దిగుబడులు సాధించాలంటే పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని, ప్రతి సీజన్‌లో ఒకే పంట సాగు చేయడం నివారించాలని సూచించారు. అలాగే పచ్చి ఎరువు పంటల సాగును ప్రోత్సహించాలని చెప్పారు.

రైతులు పచ్చి ఎరువు పంటల విత్తనాల లభ్యత, ట్రాన్స్‌ప్లాంటింగ్ యంత్రాలపై సబ్సిడీల గురించి ప్రశ్నలు అడగగా, శాస్త్రవేత్తలు సమగ్ర సమాధానాలు ఇచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన కొత్త వరి రకాల విత్తనాలపై అవగాహన కల్పించారు

నీటి వృథా తగ్గించేందుకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ విధానాలను పాటించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం వృక్షాలను పెంపొందించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల్లో సరికొత్త సాంకేతికతలపై అవగాహన పెరిగి, వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు సాధించగలరని శాస్త్రవేత్తలు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

శ్రమశక్తి అవార్డు అందుకున్న గొంగ్లూరు తాండ మోహన్ నాయక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha