Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాల్సిందే: శ్రీకాంత్

హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాల్సిందే: శ్రీకాంత్

వార్త 1 month ago

Kris Srikkanth: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములపై టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

9 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై దుస్థితికి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నిర్ణయాలే కారణమని ఆయన విశ్లేషించారు.

Read Also:BCCI Girlfriend Culture IPL: BCCI షాకింగ్ నిర్ణయం: ఐపీఎల్‌లో 'గర్ల్‌ఫ్రెండ్స్'కు నో ఎంట్రీ

‘ప్లాస్టిక్ కెప్టెన్’ సెటైర్

హార్దిక్ పాండ్యా మైదానంలో వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ.. అతడిని ఒక ‘ప్లాస్టిక్ కెప్టెన్’గా శ్రీకాంత్ అభివర్ణించారు. “హార్దిక్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు జట్టును దెబ్బతీస్తున్నాయి. కెప్టెన్సీ ఒత్తిడి వల్ల అతను ఒక ఆల్‌రౌండర్‌గా కూడా రాణించలేకపోతున్నాడు. అతడిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తేనే స్వేచ్ఛగా ఆడగలడు” అని అభిప్రాయపడ్డారు.

Kris Srikkanth comments on Hardik Pandya plastic captain MI 2026

Kris Srikkanth: రోహిత్ శర్మకు మద్దతు

ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే ఇప్పటికైనా మేనేజ్‌మెంట్ మేల్కోవాలని శ్రీకాంత్ సూచించారు. “ఇంకా సమయం మించిపోలేదు. వెంటనే హార్దిక్ నుంచి కెప్టెన్సీని తీసుకుని రోహిత్ శర్మకు అప్పగించండి. రోహిత్ నాయకత్వంలోనే ముంబై మళ్ళీ పుంజుకుంటుంది” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఓడినా పంజాబ్ కింగ్స్ పట్టుదలను మెచ్చుకున్న అయ్యర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha