Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులతో పెరిగిన ముడిచమురు ధరలు

హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులతో పెరిగిన ముడిచమురు ధరలు

వార్త 3 days ago

Crude Oil Price : అంతర్జాతీయ ఇంధన విపణిలో ముడి చమురు ధరలు అక్టోబర్ 21, బుధవారం నాడు మళ్లీ గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. అమెరికా-ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం తక్షణమే ముగుస్తుందనే ఆశలు వమ్ము కావడం..

పశ్చిమ ఆసియాలో చమురు రవాణా భద్రతపై ఆందోళనలు తీవ్రతరం కావడంతో మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ధర బ్యారెల్‌కు సుమారు 109.52 డాలర్లకు చేరుకోగా.. అమెరికాకు చెందిన ‘డబ్ల్యూటీఐ క్రూడ్’ (WTI Crude) ధర 0.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 98.19 డాలర్ల వద్ద స్థిరపడింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఇంధన ధరలు ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ, యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఒప్పందం కుదురుతోందన్న ప్రచారంతో ఒక్కసారిగా పడిపోయాయి. అయితే ఆ వార్తలు కేవలం ఊహాగానాలేనని తేలడంతో మార్కెట్లో అనిశ్చితి మళ్లీ రాజ్యమేలుతోంది.

Abhijit Deepke: దీపావళి వరకు ఆందోళనలు నిలిపివేయాలని కార్యకర్తలకు సీజేపీ పిలుపు

 Crude Oil Price

Crude Oil Price : హార్ముజ్ జలసంధి సముద్ర మార్గంలో ప్రమాద ఘంటికలు

ఈ ఉద్రిక్తతల నడుమ హార్ముజ్ జలసంధి సముద్ర మార్గంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఆ వ్యూహాత్మక జలసంధి గుండా వెళ్తున్న ఒక భారీ చమురు ట్యాంకర్‌ను సముద్రపు మైన్ (Naval Mine) ఢీకొట్టినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్‌ఐబి (IRIB) వెల్లడించింది. అయితే ఆ ట్యాంకర్ పేరు గానీ, సంఘటన జరిగిన కచ్చితమైన సమయాన్ని గానీ సదరు నివేదిక వెల్లడించలేదు. దీనికితోడు వాణిజ్య నౌకల ఇంజిన్ భాగాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరుపుతున్న దాడులు గతంలో భావించిన దానికంటే తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, ఇది చమురు సరఫరా వ్యవస్థకు పెద్ద ముప్పుగా పరిణమించిందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. కాగా పశ్చిమ ఆసియా ప్రాంతం నుండి చమురు రవాణా సాధారణ స్థితికి చేరుకుంటోందని అమెరికా చెబుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha