Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'హార్పిక్' ఇంజక్షన్‌తో భర్త ప్రాణం హరించింది..

'హార్పిక్' ఇంజక్షన్‌తో భర్త ప్రాణం హరించింది..

వార్త 2 weeks ago

Nizamabad Harpic Murder: నిజామాబాద్‌లో వివాహేతర సంబంధం కారణంగా ఒక మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఈ ఘాతుకానికి ఆమె తన ప్రియుడు, మరియు అతని స్నేహితుడి సహాయం తీసుకుంది.

ప్రస్తుతం పోలీసులు విచారణ జరిపి నిందితులందరినీ అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్‌లోని న్యాల్కల్‌కు చెందిన ప్రశాంత్ ఉద్యోగం కోసం గల్ఫ్ దేశమైన దుబాయ్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో ఇక్కడ అతని భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ప్రశాంత్ దుబాయ్ నుంచి తిరిగి రాగా, తన భార్య ప్రవర్తన గురించి తెలుసుకుని బుద్ధిగా మసలుకోవాలని ఆమెను హెచ్చరించాడు. అయితే, భర్త మాటలను పట్టించుకోని ఆమె, తన ప్రియుడు మరియు అతని స్నేహితుడితో కలిసి భర్తను చంపాలని నిర్ణయించుకుంది.

Read Also :Telugu Student Dies in USA: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన విద్యార్థిని దుర్మరణం!

Nizamabad Harpic Murder: పథకం ప్రకారం, ప్రశాంత్ ఒక మద్యం పార్టీలో ఉండగా భార్య అక్కడికి వచ్చింది. అనంతరం వారంతా కలిసి ప్రశాంత్‌ను భవనం పైనుంచి కిందకు తోసేశారు. ఈ ఘటనలో ప్రశాంత్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రశాంత్‌ను ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన భార్య, అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ చేసింది. ఆసుపత్రి బాత్‌రూమ్‌లో వాడే హార్పిక్ లిక్విడ్‌ను గ్లూకోజ్ బాటిల్‌లోకి ఇంజెక్షన్ ద్వారా ఎక్కించింది. అది నరాల్లోకి పాకడంతో ప్రశాంత్ ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయాడు. మొదట ఈ ఘటనను ప్రమాదంగానే భావించిన పోలీసులు, ఆ తర్వాత అనుమానం వచ్చి వారిని విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

వయనాడ్ టన్నెల్ ప్రాజెక్ట్‌లో కొండచరియలు విరిగి ఇద్దరు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha