Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హాస్టల్ గదిలో ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య!

హాస్టల్ గదిలో ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య!

వార్త 2 months ago

Palamuru University student: మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో చదువుతున్న కార్తీక్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

తోటి విద్యార్థులు గమనించి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ సంఘటనతో విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.

Read also: Ebola alert in telangana: ఎబోలా కలకలం.. విదేశీ ప్రయాణికులపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!

 Student commits suicide by hanging in hostel room!

Palamuru University student: ప్రాజెక్టు రిపోర్టు సబ్మిట్ చేయటానికి వచ్చి..

పోలీసులు, వర్సిటీ వర్గాల కథనం ప్రకారం.. మృతి చెందిన కార్తీక్ పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తన కోర్సుకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును కాలేజీలో సబ్మిట్ చేయటానికి అతడు యూనివర్సిటీకి వచ్చాడు. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, అంతలోనే హాస్టల్ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కార్తీక్ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

మృతుడు కార్తీక్ స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం కొత్తపల్లిగా గుర్తించారు. చేతికొచ్చిన కొడుకు ఉన్నత చదువులు చదువుకుంటూ ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

పెన్షన్ డబ్బుల కోసం తండ్రి పట్ల పిల్లల రాక్షసత్వం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha