Dailyhunt
హైదరాబాద్, ఢిల్లీ సహా పలు నగరాల్లో ఈడీ సోదాలు

హైదరాబాద్, ఢిల్లీ సహా పలు నగరాల్లో ఈడీ సోదాలు

వార్త 2 weeks ago

Hyderabad IPAC Office Raids: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. బొగ్గు స్మగ్లింగ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ (Enforcement Directorate) ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ (I-PAC) కార్యాలయాలపై మెరుపు దాడులు నిర్వహించింది.బొగ్గు స్మగ్లింగ్ కేసులో భాగంగా ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న ఐప్యాక్ కార్యాలయాలపై దృష్టి సారించారు.

Read Also: Hanuman Jayanti Hyderabad: హనుమాన్ జయంతి సందర్బంగా హైదరాబాద్ లో ఉత్సవాలు

Hyderabad IPAC Office Raids: పాత వివాదం – మమతా బెనర్జీ జోక్యం

ఐప్యాక్ కన్సల్టెన్సీ డైరెక్టర్లలో ఒకరైన రిషిరాజ్ సింగ్‌కు చెందిన ప్రాంగణంపై కూడా దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కొంతకాలంగా సోదాలు జరుగుతున్నాయి. గతంలో బెంగాల్‌లోని ఐప్యాక్ కార్యాలయాలు, ఐప్యాక్ అధినేత ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. నాడు సోదాల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడకు వచ్చి, మీడియా ఎదుటే ఫైళ్లతో వెళ్తూ కనిపించడం చర్చకు దారితీసింది.

 ED raid Prashant Kishor’s I-PAC in Hyderabad and Delhi

సోదాల సమయంలో బెంగాల్ ప్రభుత్వం నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ఈడీ అప్పుడు ఆరోపించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. మరోవైపు, మమతా బెనర్జీ కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపణలను ఖండించింది. సోదాల పేరుతో ఈడీ తన పరిధిని ఉల్లంఘించిందని ఆరోపించారు. ఇప్పుడు బెంగాల్‌లో ఎన్నికల సమయంలో సోదాలు చర్చనీయాంశమయ్యాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మరో 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha