Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు

వార్త 3 days ago

రైస్ మిల్లులను పరిశీలించిన అదనపు కలెక్టర్

ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని సూచనలు

Medak district : మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల పరిధిలోని రాచరాయ, సప్తగిరి రైస్ మిల్లులను జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.

మిల్లుల వద్ద నిల్వలో ఉన్న ధాన్యం లోడ్ల పరిస్థితిని పరిశీలించి, హమాలీల సంఖ్యతో పాటు మిల్లుల్లో కొనసాగుతున్న పనులను ఆరా తీశారు. అదేవిధంగా ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచనలు చేశారు.

Read also : MLA Lokam Naga Madhavi : మత్స్యకారులకు రూ.20,000 భృతి!

 Medak district

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు ఎక్కువసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తూకం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు, రవాణా, అన్లోడింగ్ కార్యక్రమాల్లో సమన్వయంతో పని చేసి రైతులకు మెరుగైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిల్లర్లు వై.రమేష్, సంతోష్ పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తిరుపతిలో రూ. కోటి విలువైన 500 మొబైల్ ఫోన్ల రికవరీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha