Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌ లో పలు చోట్ల అర్ధరాత్రి నుంచి భారీ వర్షం

హైదరాబాద్‌ లో పలు చోట్ల అర్ధరాత్రి నుంచి భారీ వర్షం

వార్త 2 weeks ago

Hyderabad Rain: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా రోహిణీ కార్తి ప్రభావంతో భానుడు భగభగమంటూ నిప్పుల కుంపటిలా మారాడు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాల్పులతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఊరటనిచ్చింది.

మంగళవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వాతావరణం ప్రశాంతంగా మారింది. అయితే, ఈ అకాల వర్షం పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయానికి, పంట నష్టానికి దారితీసింది.

 heavy rains in telangana

హైదరాబాద్‌ను ముంచెత్తిన జడివాన.. నిలిచిపోయిన విద్యుత్!

భాగ్యనగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత వాన దంచికొట్టింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంతో పాటు కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. అర్ధరాత్రి కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పినప్పటికీ.. పలు చోట్ల చెట్లు విరిగిపడటంతో కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Read also: School Students : పేరెంట్స్ కు గుడ్ న్యూస్..తగ్గిన టెక్స్ట్ బుక్స్ ధరలు

Hyderabad Rain: తెలంగాణ జిల్లాల్లో రికార్డు వర్షపాతం.. తడిసిన ధాన్యం!

నగరంతో పాటు తెలంగాణలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ వర్షం భీభత్సం సృష్టించింది. సిద్దిపేట జిల్లా ముస్త్యాలలో అత్యధికంగా 12.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో 11 సెం.మీ, నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8.4 సెం.మీ చొప్పున వర్షం పడింది. కాగా, ఐనవోలు, సంగారెడ్డి పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో తడిసిపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఏపీలో గాలివాన బీభత్సం.. ఆలయంలోకి చేరిన నీరు!

ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు జిల్లాలను ఈదురుగాలులు, వడగళ్ల వాన వణికించాయి.

శ్రీసత్యసాయి జిల్లా: కదిరిలో సుమారు నాలుగు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ప్రముఖ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోకి నీరు చేరింది.

ఎన్టీఆర్ & పల్నాడు జిల్లాలు: జగ్గయ్యపేట, నరసరావుపేట పరిసరాల్లో గాలివాన ధాటికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ములకలూరు - సత్తెనపల్లి మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి.

చిలకలూరిపేట: దండముడి గ్రామంలో ఈదురుగాలుల తీవ్రతకు సోలార్ ప్లేట్లు ఎగిరిపడి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలైన విషాద ఘటన చోటుచేసుకుంది.

నెల్లూరు జిల్లా: పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

బీమా డబ్బు కోసం భర్తను హత్య చేయించిన భార్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha