Hyderabad Metro:హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శనివారం ఉదయం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మెట్రో ఆన్‌లైన్ సేవల్లోని సెన్సార్లు పనిచేయకపోవడం వల్ల రాకపోకల నిర్వహణలో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడింది.
ఈ సాంకేతిక లోపం కారణంగా డిజిటల్ పద్ధతిలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు స్టేషన్ల లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది.

గేట్ల వద్ద బారులు తీరిన జనం – స్పందించని సిబ్బంది
ఆన్‌లైన్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతో మెట్రో స్టేషన్లలోని ప్రయాణ ప్రాంగణాల వద్ద ప్రయాణికులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఉదయం వేళ ఆఫీసులు, ఇతర పనులకు వెళ్లే సమయం కావడంతో జనం ఒక్కసారిగా పెద్ద ఎత్తున బారులు తీరారు. మరోవైపు, ఈ సాంకేతిక సమస్యపై మెట్రో సిబ్బంది కూడా తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి, ఆగ్రహానికి గురయ్యారు.
ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన MIM

