Hyd Serial Romeo Arrest: హైదరాబాద్ నగరంలో ప్రేమ పేరుతో మహిళలను మోసం చేస్తున్న ఒక ఘరానా కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్, తన మాటకారి తనంతో సుమారు 10 మంది మహిళలను వంచించి లక్షలాది రూపాయలు కాజేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం కుకట్‌పల్లిలో నివసిస్తున్న ఇతను, సోషల్ మీడియా వేదికగా ఆర్థికంగా స్థిరపడిన మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ దందాను కొనసాగిస్తున్నాడు.
Read Also:Ruby Hospital Kolkata:రూబీ ఆసుపత్రి లేడీస్ టాయిలెట్‌లో రహస్య కెమెరా.. ఉద్యోగి అరెస్ట్!
Rs. 13 lakhs collected in the name of startup
Hyd Serial Romeo Arrest: మైనర్ బాలిక నుంచి రూ. 13.11 లక్షలు!
ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికకు స్టార్టప్ కంపెనీ ప్రారంభిస్తున్నానని నమ్మబలికిన అర్జున్, ఆమె నుండి ఏకంగా 13.11 లక్షల రూపాయలు వసూలు చేశాడు. కేవలం మైనర్లను మాత్రమే కాకుండా, ప్రేమ పేరుతో మరో యువతి మెడలోని బంగారు గొలుసును కూడా అపహరించినట్లు ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో ఇతను విలాసవంతమైన కారును కొనుగోలు చేసి, తాను చాలా ధనవంతుడినని సమాజానికి కలరింగ్ ఇచ్చేవాడు. ఆ ఆడంబరాన్ని చూసి మరింత మంది మహిళలు ఇతని వలలో చిక్కుకునేవారు.
బ్లాక్ మెయిలింగ్ ట్విస్ట్
ఈ కేసులో మరో అనూహ్య మలుపు ఏమిటంటే, నిందితుడి కారు డ్రైవర్ భార్య కూడా ఈ మోసంలో భాగమైంది. అర్జున్‌తో ఉన్న వ్యక్తిగత సంభాషణలను (చాటింగ్) తల్లిదండ్రులకు చెబుతానని సదరు మైనర్ బాలికను బెదిరించి, ఆమె నుంచి మరో 9 లక్షల రూపాయలను వసూలు చేసింది. ప్రస్తుతం ప్రధాన నిందితుడితో పాటు ఈ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిన మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు పెరిగేకొద్దీ మరిన్ని బాధితుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

