Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్- విజయవాడ హైవేపై బస్సు దగ్ధం..డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు!

హైదరాబాద్- విజయవాడ హైవేపై బస్సు దగ్ధం..డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు!

వార్త 2 weeks ago

Bus Fire Accident: నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించి, వాహనం పూర్తిగా కాలిబూడిదైంది.

అయితే, ప్రమాదాన్ని ముందే పసిగట్టిన బస్సు డ్రైవర్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులందరూ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

r Saves Passengers

Read also: Telangana State Formation Day : తెలంగాణలో పవన్ కీలక సమావేశం

చిట్యాల వద్ద జాతీయ రహదారిపై ఘటన

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారి (NH 65) పై చోటుచేసుకుంది. బస్సు ప్రయాణంలో ఉండగానే ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. ఆ వెంటనే ఇంజిన్ నుండి దట్టమైన పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే అలర్ట్ అయిన ఆయన, బస్సును హైవే పక్కకు నిలిపివేసి, లోపల నిద్రిస్తున్న ప్రయాణికులను తక్షణమే కిందకు దిగిపోవాల్సిందిగా గట్టిగా కేకలు వేశాడు.

Bus Fire Accident: చూస్తుండగానే అగ్నికి ఆహుతైన బస్సు

ప్రయాణికులందరూ తమ లగేజీతో సహా కిందకు దిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తానికి వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే లగ్జరీ బస్సు పూర్తిగా అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపు చేశారు.

ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంజిన్‌లో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఏపీ, తెలంగాణల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha